కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిలిప్పీన్స్ లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు సెలవులు ప్రకటించాయి. అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థులు 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని అక్కడి ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు అందేవరకు తమ విశ్వవిద్యాలయాలకు సెలవులు ప్రకటిస్తున్నామని పేర్కోన్నారు. దీంతో వందలాది మంది తెలుగు విద్యార్థులు మంగళవారం ఉదయం ఫిలిప్పీన్స్ లోని మనీలా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ్నుంచి కౌలాలంపూర్ చేరుకున్నారు. కానీ అక్కడే వారిని అధికారులు నిలిపివేశారు. వెనక్కు వెళ్లిపోవాలని విమానాశ్రయం అధికారులు పేర్కోనడంతో వారు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయారు.
ఓ వైపు తిరిగి వెనక్కి వెళ్లాలన్నా పిలిప్పీన్స్ అధికారులు మాత్రం నో ఎంట్రీ అంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. విమానాశ్రయం అధికారులు తమ నుంచి పాస్ పోర్టులు తీసుకున్నారని.. బోర్డింగ్ పాస్ లను ఇస్తామని తెలిపినా ఇప్పుడు ఎంబసీ పర్మిషన్ లేకుండా వెళ్లేందుకు వీలు లేదంటున్నారని అక్కడున్నవారు వాపోతున్నారు. ఇప్పటికే కౌలాలంపూర్ విమానాశ్రయంలో వందలమంది చిక్కుకుపోయారు. వారికి తోడు ఇప్పుడు అదనంగా పిలిప్పీన్స్ నుంచి మరో విమానం కౌలాలంపూర్ చేరుకోబోతోంది. అందులోనూ ఎక్కువమంది భారతీయులే.
అక్కడున్న భారతీయుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సుమారు 3 వందల మంది ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల వారు, తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ జిల్లాల విద్యార్థులు అక్కడ చిక్కుకుపోయిన వారిలో వున్నారు. భారత్ వచ్చే విమానాలన్నీ రద్దవ్వడంతో వారంతా విమానాశ్రయంలో రోజంతా పడిగాపులు కాశారు. దీంతో ఇక్కడ చిక్కుకుపోయిన విద్యార్థుల పరిస్థితపై తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా కథనాలు ప్రసారం చేసింది.
అక్కడ విద్యార్థుల ఆవేదనను కళ్లకు కట్టినట్లు చూపించింది. దీంతో భారత ఎంబసీ అధికారులు స్పందించారు. కౌలాలంపూర్లో చిక్కుకున్న విద్యార్థులతో మాట్లాడారు. వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎయిర్ ఏషియా విమానాలను భారత్కు అనుమతిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ప్రకటనతో ఊరట లభించినట్లయింది. అయితే.. భారత ఎంబసీ అనుమతి లేకుండా విమానం ఎక్కేందుకు వీల్లేదని ఎయిర్పోర్ట్ అధికారులు విద్యార్థులను అడ్డుకుని ఆపేయడంతో వారి కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more