కరోనా వైరస్ యావత్ దేశ ప్రజలను వణిస్తోన్న విషయం తెలసిందే. ఈ తరుణంలో మరీ ముఖ్యంగా విదేశాల నుండి వచ్చిన వారితో దేశంలోకి కరోనా వస్తుందని భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్రాలు కూడా అక్షేపణలు పెడుతున్నా.. విదేశాల నుంచి వచ్చిన వారు మాత్రం వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో బాలీవుడ్ గాయని కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. 10 రోజుల క్రితం ఈమె లండన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొని వచ్చింది. లండన్ నుంచి వచ్చిన తర్వాత ఆమె ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో బస చేసింది. దీనికి తోడు ఓ పార్టీలో కూడా పాల్గొంది.
తనకు కరోనా సోకినట్టు ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఎయిర్ పోర్టులో తనకు అందరి మాదిరే పరీక్షలను నిర్వహించారని అప్పుడు ఏమీ లేదని చెప్పింది. వారం రోజుల తర్వాత కరోనా లక్షణాలు కనిపించడం ప్రారంభమైందని... 4 రోజుల క్రితం ఫ్లూ లక్షణాలు కనపడటంతో తనకు తాను పరీక్షలు చేయించుకున్నానని... పరీక్షల్లో కరోనా ఉన్నట్టు తేలిందని వెల్లడించింది. ప్రస్తుతం తాను, తన కుటుంబసభ్యులు క్వారంటైన్ లో ఉన్నామని తెలిపింది. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరూ నిర్బంధంలో ఉన్నారని చెప్పింది.
వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధం విధించుకోవాలని... వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఈ నెల 15న యూకే నుంచి భారత్ కు వచ్చిన కనిక లక్నోలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ప్రముఖులకు విందు కూడా ఇచ్చింది. అయితే, కనికకు ‘కరోనా’ సోకడంతో ఆమె ఇచ్చిన విందుకు హాజరైన వారిలో ఆందోళన మొదలైంది. ఆ విందులో కనికను కలిసిన వారి జాబితాను యూపీ అధికారులు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె తన విదేశీ ప్రయాణ వివరాల సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయకపోవడంపై కనికపై యూపీ సర్కార్ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more