KCR to extend night curfew uptill 14 April తెలంగాణలో కొనసాగుతున్న రాత్రి కర్ఫ్యూను పోడిగించే యోచన

Telangana government to extend night curfew uptill 14 april

Coronavirus In India,coronavirus updates,Coronavirus impact on economy,lockdown,coronavirus news,coronavirus,PM Modi,Coronavirus India update, coronavirus in india update, total cases of coronavirus in india, coronavirus hyderabad, coronavirus in tamil nadu, pakistan coronavirus, coronavirus cases, coronavirus in chennai, coronavirus in hyderabad, coronavirus live update india, coronavirus tamil nadu, coronavirus in india mumbai, coronavirus in gujarat, coronavirus in india latest news, Extend Night Curfew, Coronavirus, Coronavirus Effect Night Curfew Extended, Coronavirus Night Curfew Extended Till April 14, Latest Telangana News

According to the latest reports Telangana Chief Minister K.Chandrashekar Rao and his cabinet to decide the extension of night curfew even after 31st march in view to prevent the spread of deadly novel coronavirus

తెలంగాణలో కొనసాగుతున్న రాత్రి కర్ఫ్యూను పోడిగించే యోచన

Posted: 03/27/2020 11:01 AM IST
Telangana government to extend night curfew uptill 14 april

తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రాత్రి వేళ కర్ప్యూను పోడగించాలన్న యోచనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న రాత్రి పూట కర్ఫ్యూను ఈనెల 31 వరకు తొలుత విధించింనది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ నెల 31 తర్వాత కూడా ఈ కర్ప్యూను కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఏప్రిల్‌ 14 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్‌ ను కేంద్ర  ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో అప్పటివరకు రాత్రి కర్ఫ్యూను కూడా పొడిగించాలని చూస్తున్నట్లు సమాచారం.

ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలో కర్ప్యై పోడిగింపు అంశంపై కూడా చర్చించినట్లు తెలిసింది. దీనిపై మరోమారు ఒకటి, రెండు రోజుల్లో పున:సమీక్ష నిర్వహించిన ఆనంతరం నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రంలో కరోనా నివారణ, లాక్‌డౌన్‌, కర్ఫ్యూ అమలు తీరుపై సీఎం గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిపారు. ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిత్యావసరాల గురించి బయటకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని అధికారులు సీఎంకు వివరించారు.

జనం తిరుగుతుంటే కరోనా కట్టడి ఆశించిన స్థాయిలో సాధ్యం కాదని, లాక్‌డౌన్‌, కర్ఫ్యూలను మరింత పకడ్బందీగా అమలు చేయాలని సీఎం అభిప్రాయపడ్డారు. పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశాలున్నందున  రాత్రి పూట కర్ఫ్యూను కొనసాగించాలని అభిప్రాయపడినట్లు తెలిసింది. సాధ్యమైనంత త్వరగా పేదలకు రేషన్‌ బియ్యం అందించాలని ఆదేశించారు. రూ. 1500 నగదు బదిలీ ప్రక్రియను కూడా చేపట్టాలన్నారు. గ్రామాల్లో ధాన్యం, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణను వెంటనే ప్రారంభించాలన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles