కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు అంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే, ఈ లాక్ డౌన్ రోజులను ఎలా గడపాలా? అని చాలా మంది సందేహిస్తున్నారు. కొందరు తమ కుటుంబంతో అన్యోన్యంగా గడుపుతుంటే, మరికొందరు పిల్లలతో, పెద్దవారితో గడిపేందుకు సమయం వచ్చిందని ఆనంద పడుతున్నారు. మందుబాబులం మేము మందుబాబులం అంటూపాడే వారికి అది కూడా దూరమయ్యింది. దీంతో మందుపడితే తప్ప తమకు కోపం రాని భర్తలు.. మౌన మునుల మాదిరిగా భార్యలకు దొరికిపోయారు.
అయితే, ఓ వ్యక్తికి క్లిష్టమైన సమస్య ఎదురైంది. లాక్ డౌన్ వల్ల ఇంటి దగ్గర పెళ్లాంతో చస్తున్నా అంటూ ఓ వ్యక్తి కేటీఆర్ కు ట్యాగ్ చేసి ట్వీట్ చేశాడు. ‘కేటీఆర్ అన్నా, ఇంటి దగ్గర పెళ్లాంతో చస్తున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే, టీవీ చానల్ వాళ్లను కొంచెం మంచి సినిమాలు వేయమని చెప్పు. లేకపోతే నాకు ఒకే దారి ఉంది. కాబట్టి, ప్లీజ్.’ అంటూ ట్వీట్ చేశాడు. అందుకు కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ‘మీ ఆవిడ ట్విట్టర్లో లేదనుకుంటున్నా. (నీ మంచి కోసం)’ అని కేటీఆర్ రిప్లై ఇచ్చారు.
I just hope (for your well-being) that your wife is not on Twitterhttps://t.co/eezswQzlBK
— KTR (@KTRTRS) March 27, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more