ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. ఇటు భారత్ దేశంలోనూ స్టేట్ 2కు చేరుకున్న తరుణంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజీజీవనం స్థంభించిపోయింది. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ తమ ఇళ్లకు మాత్రమే పరిమితం కావాలని, ఇళ్లలోంది ఎవరూ బయటకు రావద్దని సూచనలు చేసింది. ప్రజారోగ్యం పరిరక్షణ కోసం చికిత్స లేని కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర తీసుకున్న చర్యలపై ప్రజలందరి సహకారం కూడా కావాలని కోరింది.
దీంతో దేశవ్యాప్తంగా అప్రకటిత కర్ప్యూ పరిస్థితులు అలుముకున్నాయి, ఎక్కడి బస్సులు అక్కడే, ఎక్కడి రైళ్లు అక్కడి స్టేషన్లలోనే, ఎక్కడి విమానాలు అక్కడి విమానాశ్రయాల్లోనే ఎక్కడి నౌకలు అక్కడి పోర్టుల్లోనే నిలిచిపోయాయి. ప్రజా రవాణా కూడా నిలిచిపోయింది, కేవలం నిత్యావసర సరుకులను సరఫరా చేసే వాహనాలు మినహాయిసతే ఎలాంటి వాహనాలు తిరగడం లేదు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు రద్దయిన రైళ్లలో టికెట్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు సైతం పూర్తి సొమ్మును వాపసు చేయనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రద్దు రుసుముగా మినహాయించే క్లరికల్ చార్జీలను కూడా కలసి పూర్తి మొత్తాన్ని తిరిగి ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు కంగారు పడుతూ తమ రైలు ప్రయాణాలను కాన్సిల్ చేసుకుంటున్న తరఉణంలో.. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో రద్దయిన రైల్వే ప్రయాణాలన్నింటి టికెట్లు అటోమెటిక్ గా కాన్సిల్ అవుతాయని, వాటని ప్రయాణికులు కాన్సిల్ చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. ఆన్ లైన్ రిజర్వేషన్లు వాటంతట అవే రద్దయి, పూర్తి సొమ్ము ప్రయాణికుల ఖాతాలో పడుతుందని తలిపింది.
అలాకాకుండా ఒకవేళ ప్రయాణికులే రద్దు చేసుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జీలు ఉంటాయని రైల్వేశాఖ కొద్దిరోజుల క్రితం పేర్కొంది. అయితే తాజాగా ఆ విషయంలోనూ స్పష్టతను ఇస్తూ.. కాన్సిల్ అయినా, కాన్సిల్ చేసుకున్నా ఎలాంటి ఛార్జీలు, మినహాయింపులు లేకుండా నిర్ణయం తీసుకుంది. రైళ్ల రద్దు, సడలించిన రిఫండ్ నియమాల ప్రకటనకు ముందు కూడా మార్చి 21- ఏప్రిల్ 14 మధ్య కాలం నాటి టికెట్లను కౌంటర్ల ద్వారా రద్దు చేసుకున్నవారు సైతం 100 శాతం రిఫండ్‌కు అర్హులని పేర్కొంది. రిఫండ్ మొత్తం కోసం టికెట్ రద్దు చేసుకున్న తేదీ నుంచి ఆరు నెలల్లోగా నిర్ణీత ఫారం ద్వారా సంబంధిత జోనల్ రైల్వే చీఫ్ క్లెయిమ్ ఆఫీసర్ లేదా చీఫ్ కమర్షియల్ మేనేజర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more