యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ భయం వెన్నాడుతున్నా.. మందుబాబులు మాత్రం కరోనా కుచ్ మత్ కరోనా అంటూ భయంకరమైన వైరస్ ను కూడా తేలిగ్గా తీసుకుని తమకు మద్యం బాటిళ్లను సరఫరా చేస్తే చాలునని అంటున్నారు. ఎవడి గోల వాడిది అన్నట్లు యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి నుంచి తాము తమ్మించుకునేదెలా అంటుంటూ..మందు బాబులు మాత్రం తమకు అన్ని వైరస్ లకు ఒక్కటే దివ్యౌషధం అంటున్నారు. ఇంతకీ అదెంటంటారా.? అదే మద్యం. బస్సులు రాకపోయినా, రైళ్లు నడవకపోయినా, ఇంట్లో సరకులు నిండుకున్నా.. వీరికి ఏమాత్రం పట్టడం లేదు.
అయితే కేంద్రం ఈ నెల 22న జనతా కర్ప్యూ పేరుతో అప్రకటిత కర్ప్యూను నిర్వహించి ఆ వెంటనే సోవవారం నుంచి లాక్ డౌన్ అముల చేయడంతో దేశవ్యాప్తంగా అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలు చిన్నా,చితక హోటళ్లు నుంచి అన్నీ మూతపడ్డాయి. జనం ఎవరూ వీదుల్లోకి రాకపోవడంతో తెరిచిన దుకాణాలు సైతం మూతపడ్డాయి, దీంతో మందుబాబుల మద్యం దుకాణాలు కూడా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మద్యానికి అలవాటు పడిన మందుబాబులు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. కొందరు మద్యం లేక నిద్రకు దూరం అవుతుండగా, మరికోందరి పరిస్థితి వర్ణణాతీతంగా వుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్యం ప్రియుళ్లకు ఊరటనిచ్చే వార్తను అందించింది. అంటే మద్యం దుకాణాలను త్వరలోనే తెరుస్తున్నారా..? బార్తను నిర్ణీత సమయంలో తెరిచేందుకు సన్నహాలు చేస్తున్నారా.? అన్న వార్తలు వినబడుతున్నాయి. సామాజిక దూరం పాటించి మరీ మద్యం కొనుగోలు చేస్తాం అన్న వినతులు కూడా వినిపిస్తున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం అందుకు అనుమతులను ఇవ్వడం లేదు ఎందుకంటే మద్యం పడే వరకు వున్న మాట.. మద్యం పడిన తరువాత వుండదన్న విషయం తెలుసు కాబట్టే. మరి ఇంతకీ శుభవార్త ఏమిటీ అంటారా.?
మద్యం తాగాలని వున్నా,, మద్యం దుకాణాలకు వెళ్లి మరీ అక్కడి నంచి మద్యం కొనుగోలు చేసుకుని రావాలంటే ఎంతో మంది విముఖత వ్యక్తం చేస్తారు. మద్యం దుకాణాల ముందు బారుటు కట్టే జనంలో.. అక్కడ ఎవరిని చూసినా అందిరినీ ఒకే గాడిన కట్టేసే వాతావరణం కనబడుతోంది. దీంతో అనేకమంది మద్యం దుకాణాలకు వెళ్లేందుకు ఇష్టపడరు. అయితే వీరి కోసం ఒక్క క్లిక్ తో మద్యం ఇంటికి వస్తే..ఎంత బాగుంటుంది.. అని అనుకుంటారు, ఇలాంటి వారి కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. ఆన్ లైన్ లోనే మద్యం కొనుగోళ్లు చేసుకోవచ్చు. అబ్బా..ఎంత మంచి ఛాన్స్.. చాలా రోజులు అయిపోయాయి..నోరంతా ఏదోలా ఉంది..ఛలో వైన్ షాప్స్ అని అనుకుంటున్నారు. తెలంగాణ, ఏపీలో కాదు. మరెక్కడ అంటారా..
మద్యం దొరక్క ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో కేరళ ప్రభుత్వం 2020, మార్చి 30వ తేదీ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ ప్రిస్కిప్సన్ తో మద్యం అందించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. ఆన్ లైన్ ద్వారా మద్యం విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు మద్యాన్ని మాని వేయాలని అనుకుంటున్న వారికి ఉచితంగానే శస్త్ర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీ అడిక్షన్ సెంటర్ లో చేరిపించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more