ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతూ వేలాది మందిని పోట్టనబెట్టుకున్న కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించడంతో అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు.. ముందస్తు నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్ డౌన్ విధించాయి. అంతకుముందే కరోనా కలకలం రేగుతున్న సమయంలోనే గుంపులుగా గుంపులుగా జరిగే కార్యక్రమాలకు పెళ్లిళ్లు, సభలు,సమావేశాలు, మతప్రబోధాలు ఇలాంటివి నిర్వహించకుండా దేశవ్యాప్తంగా మార్చి 3వ తేదీనే అంక్షలను అమల్లోకి తీసుకువచ్చింది. అయినా ఆ అదేశాలను పట్టించుకోకుండా.. విదేశాలకు చెందిన వందల మంది అతిధులను రప్పించి మరీ ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ మసీదులో మతప్రబోధ కార్యక్రమాలను నిర్వహించారు.
దీంతో పాటు ప్రబోధ కార్యక్రమాలు పూర్తైన తరువాత కొన్న రోజుల పాటు విదేశీయులు ఏకంగా దేశంలోని నలుమూలలా సంచరించి ఆయా ప్రాంతాల్లో మన భారతీయ మస్లింల ఇళ్లలో ఆశ్రయం పోందారు. దీంతో కరోనావైరస్ ను వారు దేశవ్యాప్తంగా ప్రబలేందుకు కారణమయ్యారు. అయితే ఇది అనుకున్న విధంగా పథకం ప్రకారమే జరిగిందా.? లేక అనుకోకుండా జరిగిందా.? అన్నది మాత్రం తెలియాల్సి వుంది. ఏదీ ఏమైనా విదేశీయులు మన దేశానికి పర్యాటకుడిగా వచ్చిన సందర్భంలో మతప్రబోధ కార్యక్రమాలలో పాల్గోనేందుకు అవకాశం లేదు. ఇలా పాల్గోన్న పక్షంలో వారు భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది.
నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటకులకు భారత ప్రభుత్వం తేరుకోలేని షాక్ ఇచ్చింది. భారత వీసా నిబంధనలను ఉల్లంఘించి మరీ మసీదులో మతప్రబోధ కార్యక్రమాల్లో పాల్గోన్న 960 మంది విదేశీయుల వీసాలను రద్దు చేయడంతో పాటు వారి పాస్‌పోర్టులను బ్లాక్ లిస్ట్ లో పెడుతూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ విదేశీయులపై చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ట్వీట్ చేసింది.
పర్యాటక వీసాలపై వచ్చిన పలువురు విదేశీయులు నిబంధనలకు విరుద్ధంగా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు హోంశాఖ మంత్రి కార్యాలయం ట్వీట్‌లో వెల్లడించింది. విదేశీయుల చట్టం-1946, విపత్తు నిర్వహణ చట్టం -2005ను వారు ఉల్లంఘించి నిజాముద్దీన్‌లోని తబ్లీగీ జమాత్‌లోని మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నందున..నిబంధనల ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ విషయం తెలిసి కూడా పలు దేశాల నుంచి వచ్చిన ముస్లిం మత పెద్దలు ఎలా పాల్గోన్నారనేదే చర్చనీయాంశంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more