India Partially Lifts Malaria Drug Export Ban on Trump Call మలేరియా డగ్ర్స్ ఎగుమతులపై పాక్షికంగా నిషేధం ఎత్తివేసిన భారత్

India partially lifts hydroxychloroquine drug export ban on trump call

Donald Trump warned India of “retaliation", Trump warns india of retaliation, trump request lift on anti-malarial drug, trump reqiest modi, trump request for hydroxychloroquine from india, India, US, Trump, Modi, Narendra Modi, Donald Trump, hydroxychloroquine, coronavirus, covid-19,

India partially lifted a ban on the exports of a malaria drug after President Donald Trump sought supplies for the U.S., according to government officials with knowledge of the matter. Exports of hydroxychloroquine and paracetamol will be allowed depending on availability of stock.

మలేరియా డగ్ర్స్ ఎగుమతులపై పాక్షికంగా నిషేధం ఎత్తివేసిన భారత్

Posted: 04/07/2020 03:31 PM IST
India partially lifts hydroxychloroquine drug export ban on trump call

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ సహా పలు దేశాల నుంచి వినతులు వెల్లువెత్తుతున్న తరుణంలో భారత్ మానవతా దృక్పథంలో వ్యవహరించేందుకు సిద్దమైంది. కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడంలో కీలకంగా మారిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌, క్లోరోక్వీన్, పారసెటమాల్ సహా పలు ఔషదాలను విదేశాలకు ఎగుమతు చేసేందుకు ముందుకోచ్చి తన ఔదర్యాన్ని చాటుకోనుంది, కరోనా వైరస్ నియంత్రణకు కీలకంగా మారిన ఔషదాల ఎగుమతులపై భారత్ విధించిన నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేసేందుకు సన్నధమవుతోంది.

ఈ మేరకు భారత విదేశాంగశాఖ తాజాగా ప్రకటించింది. కరోనావైరస్ భారినపడిన దేశాలకు అససరమైన మేర కొన్ని రకాల మందుల్ని సరఫరా చేసేందుకు అంగీకరించింది. అలాగే పొరుగుదేశాలకు పారాసిటమాల్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌ అవసరమైన మొత్తానికి లైసెన్స్‌ అనుమతులు కూడా ఇస్తున్నట్లు తెలిపింది. అయితే ఈ అంశాన్ని రాజకీయం చేస్తూ భారత్ పై ఆరోపణలు చేసే ప్రయత్నాల్ని ఇంతటితో ఆపాలని స్పష్టం చేసింది. ప్రపంచ దేశాల్లో పిట్టల్లా రాలిపోతున్న మనుషులను చూసి భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకుందే తప్ప.. మరేమీ కారణం కాదని తేల్చిచెప్పింది.

ప్రస్తుతానికి కొవిడ్‌-19 చికిత్సకు ఎలాంటి టీకాగానీ, ఔషధంగానీ లేవు. అయితే మలేరియాను నయం చేయడానికి వాడే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఆశాజనక ఫలితాలు ఇస్తోందని పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వీటిని రోగులకు దగ్గరగా ఉండే వ్యక్తులు వాడొచ్చని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ), భారత వైద్య పరిశోధన మండలి సూచించింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ మందుకు డిమాండ్‌ పెరిగింది.

అయితే భారత అవసరాలకు సరిపడిన తర్వాత అదనంగా మరో 25 శాతం నిల్వలను ఉంచుకొని.. మిగిలిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ని ఇతర దేశాలకు సరఫరా చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆయా దేశాల అవసరాల్ని నిశితంగా పరిశీలించి ఎంతమేర సరఫరా చేయాలో నిశ్చయించనున్నట్లు తెలుస్తోంది. నేడు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో మంత్రుల బృందం సమావేశమై దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయకుండా.. కేవలం కొన్ని మినహాయింపులు మాత్రమే ఇచ్చే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles