కరోనా కట్టడిని చేసేందుకు కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేసిన కేంద్రం.. ప్రజారోగ్యం ముందు ఎంతటి అర్థిక సంక్లిష్టస్థితులు ఉత్పన్నమైనా కోలుకోవచ్చునని తన చర్యలతో తేల్చిచెప్పింది. అయితే దేశ ప్రజలను ఓ సమస్య మాత్రం తీవ్ర అందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ తో ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధం లేని వ్యక్తులు కూడా సామాజిక మాద్యమాల్లో వస్తున్న తప్పుడు వార్తలను చూస్తూ తాము కరోనా బారిన పడ్డామా.? అన్న సందేహాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో టెన్షన్ కు గురవుతున్నారు.
ఈ క్రమంలో కరోనాను నియంత్రించడం కన్నా మందు.. తప్పుడు వార్తలను కట్టడి చేయాలని భావించిన కేంద్రం అటు దిశగా కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో కేంద్రం సూచనలు అందుతున్న తురుణంలోనే సామాజిక మాద్యమం వాట్సాప్ ఓ నిర్ణయం తీసుకుంది. అంతర్జాలంలో లభిస్తున్న సమాచారం నిజమైందో కాదో నిర్ధారించుకోలేక ప్రజలు అయోమయానికి గురవుతున్న నేపథ్యంలో కొవిడ్-19కు సంబంధించి తప్పుడు సమాచారం వ్యాప్తించకుండా ఆపేందుకు వాట్సాప్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వాట్సాఫ్ ద్వారా సందేశాలను ఐదుగురికి పరిమితం చేసిన ఈ యాప్ ఇక మీదట ఈ సంఖ్యను మరింత తక్కువ సంఖ్యకు కుదించింది.
దీంతో ఇకపై వాట్సాప్ ద్వారా షేర్ అయ్యే సందేశాలు ఇకమీదట ఒకరికి మాత్రమే పరిమితి చేసింది. ఒక్కసారికి ఒక్కరికి మాత్రమే షేర్ చేయగలిగే విధంగా కట్టుదిట్టం చేయడం ద్వారా మెసేజ్ లను ఫార్వర్డ్ చేయడం 25 శాతం మేరకు తగ్గుతుందని ఆ సంస్థ వివరించింది. అంతేకాకుండా తమకు వచ్చిన సమాచారాన్ని ధృవీకరించుకునే సదుపాయాన్ని కల్పించేందుకు కూడా వాట్సాప్ కృషిచేస్తోంది. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే.. ఆ మెసేజ్ లపై మాగ్నిఫైయింగ్ గ్లాస్ బొమ్మ ఉంటుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో బీటా వెర్షన్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ సదుపాయం.. త్వరలో అందరికీ అందుబాటులో రానుందని వాట్సాప్ తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more