ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మానవజాతిని కాకవికళం చేస్తున్న వేళ.. ప్రభావం బారిన పడిన దేశాలన్నీ లాక్ డౌన్ ప్రకటిస్తూ.. ప్రజల అరోగ్యాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. ఈ తరుణంలో భారత్ దేశం కూడా అలాంటి చర్యలకే శ్రీకారం చుట్టింది. పలు రాష్ట్రాల్లో మధ్యం బాబులు మతిస్థిమితం తప్పినట్టు వ్యవహరిస్తుండగా, కరోనా మహమ్మారి పంజా చాపిన తరుణంలో వీరి ఆరోగ్య పరిరక్షణకు ఎర్రగడ్డ చెస్ట్ అసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఇలాంటి వారి బాధలు అధికమవుతున్న క్రమంలో అలాంటి వారిని టార్గెట్ చేస్తూ వచ్చిన ఓ వీడియో తీసిన ఇద్దరు యువకులు కటకటాల పాలయ్యారు.
సోషల్ మీడియాలో తాము హీరోలుగా మారాలని భావించిన ఇద్దరు యువకులు.. టిక్‌టాక్ వీడియోల్లో కొంత వెరైటీ చూపించాలనుకున్నారు. అయితే వీరికి తెలంగాణ పోలీసులు అరదండాలు వేశారు. ఈ ఇద్దరు యువకులను కటకటాపాలు చేశారు. ఇంతకీ ఏ జరిగిందంటే.. హైదరాబాద్‌లోని ఈద్ బజార్‌కు చెందిన ఇద్దరు యువకులు కుమార్ సంజూ, నితిన్ టిక్‌టాక్ వీడియోలు చేస్తుంటారు. లాక్డౌన్ నేపథ్యంలో ఈసారి కొంత విభిన్నంగా వీడియోలు చేయాలని తలపోశారు. ఇందుకోసం మద్యాన్ని ఎంచుకున్నారు. మందుబాబులకు మద్యం పోస్తూ టిక్‌టాక్ వీడియోలు చేశారు.
అనంతరం ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. ఇవి కాస్తా ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ దృష్టిలో పడ్డాయి. వెంటనే స్పందించిన ఆయన లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘించడంతోపాటు మద్యాన్ని అక్రమంగా సరఫరా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో యువకులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న సరూర్‌నగర్ ఎక్సైజ్ అధికారులు ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more