తెలంగాణలో మద్యం షాపులను తిరిగి తెరిపించాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస గౌడ్ వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ప్రకృతి సిద్ధంగా లభించే తాటికల్లుపై మినహా మిగతా అన్ని రకాల మత్తు పదార్థాలపైనా నిషేధం కొనసాగుతుందని, వైన్స్ షాపుల విషయంలో ఇతర రాష్ట్రాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో పరిశీలించి, ఆపై సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయం మేరకు మద్యం దుకాణాలు తెరవాలా.? లేదా మే 3 వరకు మూసివేయాలా? వద్దా? అన్న విషయాన్ని నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.
తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన, కల్లు, మద్యం లభించక, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న వారి సంఖ్య పెరిగిందన్న విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ఈ విషయంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు వైద్యాధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. మార్చి నాలుగో వారంలో ఓ దశలో రోజుకు 100కు పైగా కేసులు ఎర్రగడ్డ మానసిక వైద్యాలయానికి వచ్చాయని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుతం కేసుల సంఖ్య చాలా వరకూ తగ్గిపోయిందని తెలిపారు. మద్యానికి బానిసలు కావడం వల్ల కొందరు ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో వారందరికీ వైద్యం లభిస్తోందని అన్నారు.
మద్యం షాపులను తెరిస్తే, అక్కడ జనాలు అధికంగా గుమికూడతారని అభిప్రాయపడ్డ శ్రీనివాస గౌడ్, ఈ కారణంతోనే షాపులను తెరిచేందుకు అనుమతించలేదని, పరిస్థితి చక్కబడిందని భావిస్తే, షాపులను తెరిచేందుకు అనుమతించే అవకాశాలుంటాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం, నాటుసారా అమ్ముతున్నారని, వారిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మద్యం షాపులకు వేసిన సీల్స్ ఎవరైనా తొలగించి, మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే, వారి లైసెన్స్ లను శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more