PM Modi extends Lockdown till May 3 లాక్ డౌన్ మే 3వరకు పొడగింపు.. త్వరలో సడలింపులు: ప్రధాని

India to remain closed till 3 may economy to open up gradually in lockdown 2 0

Narendra Modi Speech live, coronavirus outbreak, narendra modi speech on covid-19, coronavirus lockdown 2.0, lockdown in india, narendra modi address to the nation, coronavirus updates, pm narendra modi, modi extends lockdown, Coronavirus, corona, Covid-19, PM Modi, Lockdown, extension, Easing Restrictions, April 20, National Politics

Prime Minister Narendra Modi today extended the nationwide lockdown till May 3. In his address to the nation this morning, PM Modi said in some areas which are outside of Covid-19 hotspots, some conditional relaxations to resume important activities could be given after April 20.

లాక్ డౌన్ మే 3వరకు పొడగింపు.. త్వరలో సడలింపులు: ప్రధాని

Posted: 04/14/2020 01:08 PM IST
India to remain closed till 3 may economy to open up gradually in lockdown 2 0

కరోనా మహమ్మారి దేశంపై పంజా విసరుతున్న నేపథ్యంలో దానిని వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రస్తుతం దేశంలో అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఏప్రిల్ 14 నుంచి మే 3వ తేదీ వరకు పొడగిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఈ లాక్ డౌన్ మూలంగా దేశ ప్రజలు ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారో తనకు తెలుసునని అన్నారు. అయితే ప్రజారోగ్యం, ప్రజా పరిరక్షణ నేపథ్యంలో మళ్లీ కఠోర నిర్ణయం తీసుకోక తప్పడం లేదని తెలిపారు.  దేశంలో కరోనా మహమ్మారి ప్రతాపం రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఈ కఠిన నిర్ణయం తీసుకోకతప్పదన్నారు.

కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారని, లాక్ డౌన్ కష్టాలు తట్టుకుంటూ.. కరోనాపై పోరాటంలో మనం సరైన మార్గంలోనే వెళ్తున్నాం అని అన్నారు ప్రధాని మోడీ. అయితే కరోనా మాత్రం దేశవ్యాప్తంగా విస్తరిస్తుందని ఇటువంటి సమయంలో కరోనాపై పోరులో మనం పెట్టుకున్న 21రోజులు లాక్ డౌన్ మళ్లీ పొడిగించుకోవలసిన అవసరం ఉందని అన్నారు మోడీ. అందులో భాగంగానే మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించామని తెలిపారు. కరోనా వ్యాప్తిని నియంత్రించ గల అయుధం లాక్ డౌన్ ఒక్కటేనని అన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరూ సహనం వహించారని, భారత రాజ్యాంగ పీఠికలోని ‘భారత ప్రజలమైన మేము’ అన్న స్ఫూర్తిని దేశప్రజలు చాటారని అన్నారు.

కరోనా వైరస్ విషయంలో తాము వేగంగా స్పందించి.. అంతకుమించిన వేగంగా తీసుకున్న నిర్ణయాలే దేశంలో కరోనా ప్రభావం అంతంతమాత్రంగానే వుందని అన్నారు. దేశంలో 500 కేసులు ఉన్నప్పుడే లాక్‌డౌన్‌ నిర్ణయం తీసుకున్నామని ఆయన గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఎదుర్కొంటున్న పరిస్థితులు బట్టి చూస్తే మనం అనుసరిస్తున్న మార్గం సరైనదేనని మరో 19రోజులు పొడగింపు నిర్ణయానికి మద్దతు తెలపాలని అన్నారు. అయితే కరోనా హాట్ స్పాట్లు కాని ప్రాంతాల్లో ఏప్రిల్ 20వ తేదీ తర్వాత సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని అన్నారు.

అయితే కేసులు పెరగకపోతే మాత్రమే ఈ నిర్ణయం తీసుకుంటామని అన్నారు. కరోనాపై పోరాటంలో దేశమంతా ప్రతి ఒక్కరు సైనికులులా పనిచేస్తున్నారని, ఇలాగే పోరాటం కొనసాగించవలసిన అవసరం ఉందని అన్నారు మోడీ. ఇప్పటికే దేశంలో 10వేల కేసులు నమోదు కాగా ఇంకా మనం అప్రమత్తంగా వ్యవహిరించాల్సిన అవసరం ఉందని అన్నారు ప్రధాని మోడీ. ఈ క్రమంలోనే దేశప్రజలు మరింత కఠినంగా లాక్ డౌన్ ను అములపర్చాలని సూచించారు. ఇకపై వచ్చే రెండు వారాలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతీ ఒక్కరు వ్యవహరించాలని, ఈ రెండు వారాలే అత్యంత కీలకమని ప్రధాని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles