Telangana CM KCR likely to extend lockdown తెలంగాణలో మూడో పర్యాయం లాక్ డౌన్ పోడగింపుపై యోచిస్తున్న సీఎం

Telangana cm kcr likely to extend lockdown for the third time

Telangana CM, KCR, Lockdown, Extension, Telangana Health Minister, Etela Rajender, coronavirus, covid-19, Telangana

Telangana Chief Minister K Chandrashekar Rao opinioned that the people should support lockdown for few more days to combat the virus from further spreading. Addressing the review meeting at Pragathi Bhavan, CM KCR said that the lockdown is the only way to contain the virus and expressed confidence that the number of Corona cases are decreasing in the state due to the lockdown only.

తెలంగాణలో మూడో పర్యాయం లాక్ డౌన్ పోడగింపుపై యోచిస్తున్న సీఎం కేసీఆర్

Posted: 04/27/2020 10:24 AM IST
Telangana cm kcr likely to extend lockdown for the third time

యావత్ ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ జడలు విప్పుతూ ప్రభావితం చూపుతున్న నేపథ్యంలో ఇటు తెలంగాణలో మాత్రం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. గత నాలుగైదు రోజులుగా కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో.. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రభుత్వాధి నేతలు, వైద్యఅరోగ్యశాఖ, వైద్య సిబ్బంది, పోలీసులు, హెల్త్ వర్కర్లు, మున్సిఫల్ సిబ్బంది కృషి ఫలించిందనే చెప్పాలి. కాగా, దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 3 వరకే అమలు చేస్తుండగా, తెలంగాణలో మాత్రం మే 7వ తేదీ వరకు పొడగించింది ప్రభుత్వం,

ఈ లాక్ డౌన్ కాలం పూర్తి అయ్యే లోపు తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పూర్తిగా వుండవని కూడా తెలంగాణ వాసులు బావిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని మరింత అధ్యయనం చేయడంతో పాటు మరింత అదుపులో ఉంచుకునేందుకు మే 7 తరువాత, మరికొన్ని రోజులు లాక్ డౌన్ ను పొడిగించాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రజలంతా ఇళ్లలో ఉంటేనే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమని, ఆదివారం ప్రగతిభవన్ లో ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో వ్యాఖ్యానించిన ఆయన, సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే వీడియో కాన్ఫెరెన్స్ లో దేశంలో పరిస్థితి తెలుస్తుందని అన్నారు.

తెలంగాణలో కరోనా మరణాల రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని గుర్తు చేసిన ఆయన, ప్రధానితో మాట్లాడిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకుందామని అధికారులతో అన్నట్టు తెలుస్తోంది. ఇక కేసుల సంఖ్య అధికంగా ఉన్న రాజధాని నగరంపై మరింత దృష్టిని సారించాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కంటైన్ మెంట్ జోన్లలో ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందులూ రాకుండా చూసుకోవాలని సూచించారు. కాగా, ఇప్పటివరకూ తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1000 దాటగా, 316 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. 25 మంది మరణించారు. ఆదివారం నాడు కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles