ఉద్యమ సమయంలో తెలంగాణ భవన్ ఉద్యమకారులందరికీ ఓ చల్లటి నీడనిచ్చే కానుగ, ఆకలిని దూరం చేసే చల్లని తల్లి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులెవరు హైదరాబాద్ వచ్చినా తెలంగాణ భవన్ అక్కున చేర్చుకొని ఆదరించేది. వచ్చినవారంతా భోజనం చేసి వెళ్లేది. ఆ రోజుల్లో తెలంగాణ భవన్ ఉద్యమకారులందరికీ ఓ అండ, దండ. తెలంగాణ భవన్ ఉద్యమాన్ని వ్యవస్థీకృతం చేయటంలో ప్రధాన భూమిక పోషించింది. రాష్ట్ర సాధన తర్వాత జిల్లాకొక తెలంగాణ భవన్ ఏర్పాటవటం టీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలందరికీ విజయ చిహ్నం.
* కాళేశ్వరంలో మొట్టమొదటిసారిగా నీళ్లు వచ్చినప్పుడు అందరూ గోదావరి నీటిని చూశారు. కానీ నేను.. ఆయన కళ్లల్లో ఆనందబాష్పాలను చూశాను..
* ఎకానమీని రివైవ్ చేసుకోవచ్చు. కానీ ఒక్క ప్రాణం పోయినా తిరిగి తెచ్చుకోలేమని చెప్పిన గొప్ప మనసున్న మనిషి పెదనాన్న.
* ‘మై అకేలా హీ చలా థా జానీబ్- ఈ- మంజిల్ మగర్ లోగ్ సాత్ ఆతే గయే ఔర్ కార్వాన్ బన్తా గయా’
మజ్రూహ్ సుల్తాన్‌పురి మాటలు టీఆర్‌ఎస్ పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అచ్చంగా సరితూగుతాయి. సరిగ్గా ఇరువై ఏండ్ల కిందట ఒక్కడిగా మొదలైన ప్రస్థానం.. ఇప్పుడు ఆయనతో కోట్లాదిమంది జతకూడారు. నాడు ఏ లక్ష్యం కోసమైతే ప్రతినబూనారో.. అది సాకారమైంది. వలస పాలకుల ప్రయోగశాలగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అభివృద్ధికి, సబ్బండవర్గాల సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ అయ్యింది. నేటి తెలంగాణ భారతదేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ రోల్‌మోడల్.
* జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ భావవ్యాప్తి చేయడంలో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. 1969 ఉద్యమం నీరుగారడానికి, కేసీఆర్ చేపట్టిన ఉద్యమం విజయతీరాలను ముద్దాడేందుకు భావవ్యాప్తి, ఉద్యమ పంథాలే కారణం. 1969 ఉద్యమాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అక్కడ జరిగిన పొరపాట్లు ఈ దశలో జరుగకుండా చూశారు.
* కేసీఆర్ మాటంటేనే ఓ భరోసా అని రాష్ట్రంలో స్థిరపడిన ఇతర రాష్ర్టాలవారు కూడా ప్రశంసించడం మనకు గర్వకారణం.
ఇరువై ఏండ్ల కిందట ఓ బక్కపలుచని వ్యక్తి ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా.. తనవెంట బయల్దేరిన పిడికెడు మందితో మొదలుపెట్టిన ప్రయా ణం చూసి మఖలో పుట్టి పుబ్బలో పోయే పార్టీ అన్నా రు. ఇసొంటియి ఎన్ని పార్టీలు చూడలేదని తక్కువ చేసి మాట్లాడారు. అవమానాలు.. చీదరింపులు ఒక టా రెండా.. వందలు.. వేలు. కానీ, ఇప్పుడు వాటన్నింటిని దాటి తెలంగాణ సాధించుకునుడే కాదు.. అధికారంలోకి వచ్చింది. ఇంకో వందేండ్ల పాటు రాష్ర్టాన్ని సుభిక్షంగా ఉంచేలా టీఆర్‌ఎస్ పార్టీ తయారైంది. తెలంగాణ ప్రజల గొంతుకైంది. జాతీయ రాజకీయాల్లోనూ కీలక భూమిక పోషిస్తున్నది. ఇదంతా ఆషామాషీగా జరుగలేదు. ఇరువై ఏండ్లను ఒక్కసారి వెనక్కితిరిగి చూసుకుంటే నిద్రలేని రాత్రులెన్నో... ఇప్పుడు టీఆర్‌ఎస్ ఇంత బలంగా ఉందంటే అది రాత్రికిరాత్రి జరిగిపోలేదు.
ఎందరితో ఎన్ని చర్చలో
* పార్టీ కోసం, ఉద్యమం కోసం పెదనాన్న (కేసీఆర్) అహర్నిశలు కష్టపడ్డారు. ముమ్మాటికీ ఇది ఆయన రక్తంలో నుంచి వచ్చింది. టీఆర్‌ఎస్ పెట్టడానికి ముం దు రాత్రింబవళ్లు తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చించేవారు. నెలల తరబడి అన్ని వర్గా లకు చెందిన వందల మందిని కలిశారు. వేలాదిమందితో సంప్రదింపులు చేశారు. ఇప్పుడు ఉద్యమం అం టే ఎట్లా అని, పార్టీ పెడితే రాణించగలమా అంటూ చాలామంది నిరుత్సాహపరిచేవారు. చంద్రబాబుకు అప్పటికే బలమైన నేతగా దేశంలో పేరున్నది. ఇటుప క్క కేసీఆర్‌కు అర్థబలం లేదు, అంగ బలం లేదు. ఉన్నదల్లా ఆత్మబలం.
* ఆ బలమే ఆయన వ్యూహం. ఆ బల మే తెలంగాణ ఉద్యమమైంది. ఉద్యమం విఫలమ య్యే ప్రసక్తే లేదని, గమ్యాన్ని ముద్దాడేవరకు విశ్రమించబోనని కేసీఆర్ తరచూ అనేవారు. ఆయనతో ఆ రోజుల్లో పొద్దున్నుంచి రాత్రివరకు ఉండేవాళ్లం. గంట ల తరబడి సమావేశాలు జరిగేవి. ఒక్కోసా రి ఉదయం తొమ్మిది గంటలకు మొదలైన సమావేశాలు మరుసటిరోజు తెల్లారి ఆరింటివరకు కొనసాగేవి. జయశంకర్ సార్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, వినోద్‌కుమార్, దేశిని చినమల్లయ్య.. ఇలా అనే కమందితో చర్చలు జరిగేవి. టీఆర్‌ఎస్ స్థాపించిన తర్వాత కూడా ఇదే ఒరవడి కొనసాగింది. ప్రతి అంశంపై సూక్ష్మంగా ఆలోచించేవా రు. చర్చించేవారు. విశ్లేషించేవారు.
* టీఆర్‌ఎస్‌ను, ఉద్యమాన్ని అణిచివేసేందుకు చేసిన కుట్రలెన్నో. కేసీఆర్‌పై వ్యక్తిగతంగా కిం చపరిచేలా, అవమానపరిచేలా చేసిన పనులెన్నో. ఆయనపై జరిగినంత వ్యక్తిగత దాడి దేశంలోని మరే నేతపై జరుగలేదు.
* అందరు చెప్పేది వినేవారు. అన్నింటిలో నుంచి తన వాదనను సిద్ధం చేసుకునేవారు. అందుకే కేసీఆర్ మాటల్లో స్పష్టత ఉం టుంది. సాధికారత కనిపిస్తుంది. ఆయనకు ప్రతి అం శంపై సాధికారత ఉన్నది. ఆయన లాంటి నాయకులు అరుదు. మన దేశంలో అయితే లేరు. మీ బానిసత్వాన్ని మీరే పోగొట్టుకోవాలన్న అంబేద్కర్ సూక్తిని అనుసరించారు. నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒకరోజు ఉదయం ఆరుగంటలకు కాంగ్రెస్ నేత కోదండరెడ్డి నుంచి ఫోన్ వచ్చింది. ఫతే మైదాన్ క్లబ్‌లో తెలంగాణపై ఒక మీటింగ్ పెట్టుకుందాం రండి అంటూ పెదనాన్నను ఆహ్వానించారు.
దీనికి పెదనాన్న స్పందిస్తూ.. వంద మందికి భోజనమే కదా. మన ఇంటికే రండి అని ఆహ్వానించారు. సమావేశం రాత్రి వరకు కొనసాగింది. కొందరు వాయిలెన్స్ (హింస) అని కూడా అన్నారు. వాయిలెన్స్ చేస్తే తెలంగాణ వస్తదనుకుంటే నలుగురైదుగురు గుండాలు చాలు, నేను అక్కర్లేదన్నారు పెదనాన్న. శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అయితేనే మీతో ఉంటానని చెప్పారు. నాది స్టేట్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ కాదని తేల్చిచెప్పారు.
2001, ఏప్రిల్ 27వ తేదీన పార్టీని అధికారికంగా ప్రకటించే నాటికే జెండా, రంగులు, గుర్తు అన్నింటిని సిద్ధం చేశాం. పార్టీ ఎంచుకున్న రంగు, జెండా తాననుకున్న విధంగా వచ్చేవరకూ రాజీ పడలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఈరోజు వరకు పెదనాన్న ప్రసం గం ఏదైనా అద్భుతమే. ప్రతి అంశాన్ని లోతుగా, తెలుసుకోవడం, విశ్లేషించుకోవడం, దాన్ని ప్రజల భాషలో చెప్పడం ఆయన ప్రత్యేకత. దేశంలో అనేక మంది నేతలు తమ ప్రసంగ కాపీలను చూసుకొని చదువుతారు. కానీ, పెదనాన్న ఒక్కరే కాగితం చూడకుండా ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగం ఉందంటే ప్రజలు బండ్లు కట్టుకొని, పాదయాత్ర చేసుకుంటూ వచ్చేవారు. కేసీఆర్ మాటంటేనే ఓ భరోసా అని రాష్ట్రంలో స్థిరపడిన ఇతర రాష్ర్టాలవారు కూడా ప్రశంసించడం మనకు గర్వకారణం.
ప్రపంచ ఉద్యమాలకు దిక్సూచి..
ప్రపంచ ఉద్యమాలకు తెలంగాణ ఉద్యమం ఒక దిక్సూచిగా మారింది. ప్రతి అంశంలోనూ ప్రత్యేక రాష్ట్ర కాంక్షను తెలుపడంలో టీఆర్‌ఎస్ విజయం సాధించిం ది. మన పండుగలు, మన సంస్కృతి, చివరికి పుష్కరాలను కూడా తెలంగాణ కోణంలోనే నిర్వహించుకునేలా చేశాం. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ప్రపంచంలోని అనేక ఉద్యమాలకు అధ్యయనాంశమైంది. నెత్తు రుచుక్క చిందించకుండా రాష్ట్రం సాధిస్తామని 2001, ఏప్రిల్ 27న పెదనాన్న ప్రకటించారు. అన్నట్టుగానే సాధించారు.
* టీఆర్‌ఎస్‌ను, ఉద్యమాన్ని అణిచివేసేందుకు చేసిన కుట్రలెన్నో. కేసీఆర్‌పై వ్యక్తిగతంగా కిం చపరిచేలా, అవమానపరిచేలా చేసిన పనులెన్నో. ఆయనపై జరిగినంత వ్యక్తిగత దాడి దేశంలోని మరే నేతపై జరుగలేదు. చివరికి సమైక్య పాలకులు పార్టీని చీల్చే కుట్ర చేశారు. కానీ, ఆయన అన్నింటిని తట్టుకున్నారు.
* తనదైన పంథాలో ఉద్యమాన్ని, పార్టీని నడిపించారు. కొత్త తరహా ఉద్యమాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. వంటావార్పు, సాగరహారం, ఉప ఎన్నికలు, సడక్ బంద్, మిలియన్ మార్చ్, అమరణ నిరాహార దీక్ష, బతుకమ్మ పండుగ, తెలంగాణ సంబురాలు, తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన, ప్రతి ఊరిలో ప్రతిష్ఠించడం, కళారూపాలు, ప్రాచీన వారస త్వ సంపద కోసం చేసిన పోరాటాలు... ఇలా ఒక్కటేమిటి పద్నాలుగేండ్ల ఉద్యమ చరిత్రలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త పంథాలో ఉండేలా చేశారు.
దీన్ని దేశ, విదేశాల్లోని ఉద్యమకారులు కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను తెలిపేందుకు ఇన్ని రూపాలుంటాయా? అంటూ ప్రశంసించారు. జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ భావవ్యాప్తి చేయడంలో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. 1969 ఉద్యమం నీరుగారడానికి, కేసీఆర్ చేపట్టిన ఉద్యమం విజయతీరాలను ముద్దాడేందుకు భావవ్యా ప్తి, ఉద్యమ పంథాలే కారణం.
* ప్రతి అంశాన్ని లోతుగా, తెలుసుకోవడం, విశ్లేషించుకోవడం, దాన్ని ప్రజల భాషలో చెప్పడం ఆయన ప్రత్యేకత. దేశంలో అనేక మంది నేతలు తమ ప్రసంగ కాపీలను చూసుకొని చదువుతారు.
* 1969 ఉద్యమాన్ని అధ్యయనం చేసి అప్పుడు జరిగిన పొరపాట్లు ఈ దశ లో జరుగకుండా చూశారు. గమ్యాన్ని ముద్దాడేవరకు విరామం లేదంటూ ప్రకటించి తెలంగాణవాదుల్లో ఆత్మైస్థెర్యం నింపారు. బొంత పురుగునైనా ముద్దుపెట్టుకుంటాం అంటూ, ఆర్‌ఎస్‌ఎస్ నుంచి ఆర్‌ఎస్ యూ వరకు, కలిసివచ్చే ప్రతి ఒక్కరిని తనతో కలుపుకొన్నారు. చిన్నగా, ఒక నదిపాయలా మొదలైన టీఆర్‌ఎస్ నేడు జీవనదిలా మారింది.
* తెలంగాణ తప్ప మాకేం వద్దంటూ కేంద్రమంత్రిగా ఉంటూ పోర్ట్‌ఫోలి యో లేకుండా ఎనిమిది నెలల పాటు ఉన్న ఘనత కూడా పెదనాన్నకే దక్కుతుంది. నాడు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో వేసిన సబ్‌కమిటీలో తెలంగాణకు మద్దతు లేఖలు సాధించేందుకు ఆయన ఎంతమంది చుట్టు తిరిగారో తెలియదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కేసీఆర్ మాట్లాడని నాయకులు లేరు.
* బీఎస్పీ నాయకురాలు మాయావతిని ఒప్పించేందుకు 19 సార్లు ఆమె వద్దకు వెళ్లారు. ప్రతి పార్టీని తెలంగాణపై ఒప్పించారు. ఉమ్మ డి రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీజేపీతో పాటు టీడీపీని కూడా ఒప్పించారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఎక్కని కొండ లేదు, మొక్కని బండలేదు. తెలంగాణ ఆర్ద్రత ఉన్న వ్యక్తి కేసీఆర్. తెలంగాణ తడి ఆయనలో కనిపిస్తుంది. తెలంగాణ గరిమ తెలిసిన నాయకుడాయన. అందుకే రాజకీయాల్లో కర్మయోగి కేసీఆర్ అని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పోర్ట్ ఫోలియోలు ఇచ్చే అంశంపై తాను టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్‌తో చర్చించిన ఉదంతాన్ని మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తన ‘ది కోలిషన్ ఇయర్స్' అన్న పుస్తకంలో ఉటంకించారు. ‘ప్రణబ్‌జీ మీకు నా ఆశ యం తెలుసు. నాకు తెలంగాణ రాష్ట్రం కావాలి. నాకు పోర్ట్‌ఫోలియో ముఖ్యం కాదు.
* మీరేది ఇచ్చినా సంతోషంగా అంగీకరిస్తా. కానీ, దేవుడి దయ.. ప్రత్యేక తెలం గాణ ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకోం డి’ అని కేసీఆర్ ఆయనతో అన్నారు. ‘కేసీఆర్ వంటి నేతలు చాలా అరుదు. తాను ప్రారంభించిన ఉద్యమ ఫలితాన్ని చూడగలిగారు. ఇలాంటివారు అరుదుగా ఉంటార’ని ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఉద్యమంలో ఎందరు, ఎంత కవ్వించినా టీఆర్‌ఎస్ తన పరిధి దాటి ప్రవర్తించలేదు. పొట్టకొట్టే వాడితోనే సమస్య, పొట్ట చేతపట్టుకొని వచ్చిన వాళ్లతో వైరం లేదని, తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు తెలంగాణవాసులే అని ప్రకటించారు కేసీఆర్. తద్వారా బతుకుదెరువు కోసం వచ్చి నవారికి ధైర్యం ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కూడా ఇక్కడ శాంతిభద్రతల సమస్య రాలేదు.
* కేసీఆర్ మౌనం కూడా ఉద్యమ స్వరూపంలా ఉండేది. కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ చర్చోపచర్చలు జరిగేవి. ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా కొన్ని సందర్భాల్లో మౌనంగానే ఉంటారు. మౌనంగా ఉన్నపుడే ఆయన ఎక్కువ పనిచేస్తారు.
* కరోనా విషయంలోనూ దేశంలోని ఏ ముఖ్యమం త్రి స్పందించకముందే వలస కార్మికుల ఆకలిబాధలు తీర్చడం మా కర్తవ్యమని, వారు తెలంగాణ అభివృద్ధి భాగస్వాములంటూ కేసీఆర్ చెప్పారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి.
మౌనం కూడా మాట్లాడేది..
కేసీఆర్ మౌనం కూడా ఉద్యమ స్వరూపంలా ఉండే ది. కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ చర్చోపచర్చలు జరిగేవి. ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా కొన్ని సందర్భాల్లో మౌనంగానే ఉంటారు. మౌనంగా ఉన్నపుడే ఆయన ఎక్కువ పనిచేస్తారు. ఉద్య మ సమయంలో అయినా, ఇప్పుడైనా ప్రచారం కోసం ఏదో ఒకటి మాట్లాడే వ్యక్తి కాదు. ప్రతి మాటకు, ప్రతి పదానికి విలువ ఉంటుందని, అనవసరంగా ఏదీ మాట్లాడవద్దని తరచూ చెప్తుంటారు. ప్రజలకు లేదా ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలనుకుంటే అర్థవంతంగా వివరిస్తారు. ఏదీ నర్మగర్భంగా ఉండదు. ఉచ్ఛారణ సహా ప్రతి దాంట్లో స్పష్టత ఉంటుంది. ఆయన ఇచ్చే ఆదేశాలను పాటించేందుకు ఆ స్పష్టత మాలాంటివాళ్లకు ఉపయోగపడుతుంది.
* రాముడు పద్నాలుగేండ్ల పాటు వనవాసం చేసి దేవుడయ్యాడు. కేసీఆర్ కూడా పద్నాలుగేండ్ల ఉద్యమవాసం చేసి ప్రజల గుండెల్లో దేవుడయ్యారు.
రాజీనామాలు.. ఉప ఎన్నికలు..
దేశంలో టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు చేసినన్ని రాజీనామాలు, మరే పార్టీ ప్రతినిధులూ చేసి ఉండరు. ఉద్యమాన్ని బతికించుకోవడానికి, ప్రజల్లో చర్చ పెట్టడానికి ఇదో ఆయుధంగా ఉపయోగపడేది. ఉద్యమం పట్ల ప్రజలను కార్యోన్ముఖులను చేయడానికి ఉప ఎన్నికలు ఉపయోగపడినాయి. ప్రజల నాడి తెలుసుకోవడానికి దోహదపడ్డాయి. రాజకీయపార్టీలు ఎన్నిక ల్లో రకరకాల ఎత్తుగడలు వేసేవి. సినిమా నటులను రంగంలోకి దిం చేవి, జాతీయ నాయకులను తెచ్చుకునేవాళ్లు. డబ్బు లు, మద్యం పారించేవాళ్లు. టీఆర్‌ఎస్ మాత్రం ఇవేవీ చేయలేదు.
పార్టీకి ఏకైక స్టార్ క్యాంపెయినర్ పెదనాన్నే. 2014 ఎన్నికల సందర్భంగా ఒక్క డే 108 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన సభల్లో పాల్గొన్నారు. ఉద్య మం అంటే ఉద్యమం లాగే చేయాలని, దీని ఎత్తుగడులను ప్రత్యేకంగా రూపొందించుకోవాలని చెప్పా రు. అందులో భాగంగానే యూనివర్సిటీలు మొదలు రాష్ట్రస్థాయి వరకు జేఏసీల ఏర్పాటు. కేసీఆర్ ఆలోచనల్లో నుంచి వచ్చిందే జేఏసీల నిర్మాణం. ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, రాజకీయపార్టీలు.. ఇలా రాష్ట్రస్థాయిలో అనేక జేఏసీలు ఏర్పాటు చేశారు.
* నాకు పోర్ట్‌ఫోలియో ముఖ్యం కాదు. మీరేది ఇచ్చినా సంతోషంగా అంగీకరిస్తానన్న అరుదైన నేత కేసీఆర్.. ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తే ఉద్యమ ఫలితాన్ని చూడగలగడం గొప్ప విషయం. అది కేసీఆర్‌కే సాధ్యమైంది.- ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి
(Image Source: Ntnews.com)
చెప్పింది చేసిచూపిస్తూ...
2001, ఏప్రిల్ 27వ తేదీన పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఏం చెప్పారో.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరించి చూపడం ఒక్క కేసీఆర్‌కే చెల్లింది. రాముడు పద్నాలుగేండ్ల పాటు వనవాసం చేసి దేవుడయ్యాడు. కేసీఆర్ కూడా పద్నాలుగేండ్ల ఉద్యమవాసం చేసి ప్రజల గుండెల్లో దేవుడయ్యారు. పద్నాలుగేండ్లలో ఏ ఎన్నికల్లో కూడా మ్యానిఫెస్టో పెట్టకుండా, ప్రత్యేక రాష్ట్రమే ఎజెండాగా నడిపించడం మామూలు విషయం కాదు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికలను కూడా ఎదుర్కొన్నాం.
అలాగే, పదుల సంఖ్యలో వచ్చి న ఉప ఎన్నికలను పార్టీ ఎదుర్కొన్నది. ఆర్థిక, అంగబలం లేని ఉద్యమ పార్టీ ఇన్ని ఎన్నికలను ఎదుర్కోవడమంటే ఆషామాషీ కాదు. ఇక 2001లో జలదృశ్యం లో తన ప్రసంగంలో కేసీఆర్ ఏం చెప్పారో.. ఇప్పుడు వాటిని అమలుచేస్తున్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్లు, మిషన్ కాకతీయ, నీటిపారుదల రంగానికి, వ్యవసాయానికి పెద్దపీట వేయడం, మిషన్ భగీరథ, సంక్షేమ కార్యక్రమాల అమలు, రైతుబంధు, ఉద్యోగులకు జీతభత్యాలు.. ఇలా చెప్పుకొంటూ వెళ్తే ప్రతీది నాడు కేసీఆర్ చెప్పినదే.
ఉద్యమ సందర్భంలో ప్రజల నుంచి విజ్ఞప్తులే ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు. ప్రజాస్వామ్య రాజకీయాలున్న మనదేశం లో చెప్పింది ఆచరించడం అంత సులభం కాదు. తెలంగాణ ఇప్పుడు దేశం లో నంబర్ వన్ రాష్ట్రం. అనేక అవార్డులు సాధించిం ది. టీఆర్‌ఎస్ రాష్ర్టాన్ని సాధించడమే కాదు, సాధించుకున్న రాష్ర్టాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. తెలంగాణకు టీఆర్‌ఎస్ పార్టీనే శ్రీరామరక్ష. తరాలు మారుతా యి కానీ మన స్వరం ఒక్కటే.
జై తెలంగాణ.. జైజై తెలంగాణ.. జై టీఆర్‌ఎస్.. జై కేసీఆర్...
- జోగినపల్లి సంతోష్‌కుమార్, రాజ్యసభ సభ్యులు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more