కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతున్న వేళ దేశంలో నెలకొన్న పరిస్థితులు.. లాక్ డన్ ఎత్తివేత తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో సమవేశమై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయాలను తీసుకున్నారు. మే 3వ తేదీలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ముగియనున్న విషయం తెలిసిందే. మండలం రోజుల పాటు లాక్ డౌన్ ను అమలు చేస్తే, కరోనాను తరిమికొట్టవచ్చన్న ఆలోచనతో తొలుత 21 రోజులు, ఆపై మరో 19 రోజుల లాక్ డౌన్ ను ప్రధాని నరేంద్ర మోదీ తెరపైకి తెచ్చారన్న విషయం తెలిసిందే.
ఇవాళ వీడియో కాన్ఫెరెన్స్ ప్రధాని మోదీ అందరు ముఖ్యమంత్రులతో సమావేశమై ముఖ్యమంత్రులు అభిప్రాయాలను తీసుకున్నారు. పలురాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఇప్పటికీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు లాక్ డౌన్ పొగడించాలన్న అభిప్రాయాన్ని కూడా ప్రధాని ముందు ఉంచాయని సమాచారం. లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు ఆగిపోయి, కోట్లాది మంది తమ ఉపాధిని కోల్పోయిన వేళ, ఆర్థిక వృద్ధి పాతాళానికి పతనం కాగా, దాన్ని తిరిగి నిలిపేలా కొన్ని కీలక నిర్ణయాలను ఈ దఫా మోదీ ప్రకటిస్తూ, లాక్ డౌన్ నుంచి ఉపశమనాన్ని కలిగించవచ్చని తెలుస్తోంది.
ఇదే సమయంలో వివిధ రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి, ప్రజా రవాణాను తిరిగి తెరవడంపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని కూడా మోదీ వెసులుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయని పీఎంఓ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో సీఎంల సలహాలను తొలుత అడిగి తెలుసుకోవాలన్న ఆలోచనతో ఉన్న మోదీ, ఆపై మొత్తం పరిస్థితిని సమీక్షించి, లాక్ డౌన్ ను పొడిగించాలా? లేక సడలింపులు ఇవ్వాలా? అన్న విషయమై తుది నిర్ణయానికి వస్తారని సమాచారం.
ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచాలని, ఆర్థిక సాయం అంశాలను పలు రాష్ట్రాలు ప్రస్తావిస్తున్నట్టు తెలుస్తోంది. దశల వారీగాలాక్డౌన్ను ఎత్తివేయాలని ఇప్పటికే పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. దేశంలో ఇప్పటివరకు 27,892 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 872 మంది మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో సీఎంలతో జరుగుతున్న వీడియో కాన్ఫరెన్స్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more