కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకూ పెరుగుతున్న వేళ దేశంలో నెలకొన్న పరిస్థితులు.. లాక్ డన్ ఎత్తివేత తరువాత ఎలా ముందుకెళ్లాలన్న విషయంలోనూ ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖ సినీనటులతో కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో ఇటు దేశంలోని వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన ప్రముఖ సిరం ఇన్స్టిట్యూట్ కొవిడ్-19 వ్యాక్సిన్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం బ్రిటన్ లో క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్న వ్యాక్సిన్ సక్సెస్ అయితే వెంటనే భారతీయుల కోసం వ్యాక్సిన్ ఉత్పదతను సిద్దం చేస్తామని ప్రకటించింది.
దేశంలోని అందరికీ ఈ వ్యాక్సీన్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మరికొన్ని రోజుల ఆగాల్సి వుంటుందని చెప్పింది. ప్రస్తుతం 6కోట్ల డోస్‌లను ఈ సంవత్సరం ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ ను ఇప్పటికే జంతువుల్లో పరీక్షలు జరిపి.. విజయవంతమైన ఫలితాలు రాబట్టామని చెప్పారు. కాగా హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభించాల్సి వుందని అందుకు అనుమతులు కూడా కోరామని చెప్పారు. అయితే, ‘ChAdOx1 nCoV-19’ పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ విజయవంతం కాగానే వీటిని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిరం ఇన్స్టిట్యూట్ సీఈఓ అధర్ పూనావాలా వెల్లడించారు.
ఈ వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎంతోమంది అత్యున్నత స్థాయి నిపుణులు నిమగ్నమయ్యారని.. అందుకే వ్యాక్సిన్ తొందరలోనే వస్తుందని నమ్ముతున్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు వెయ్యి పరిశోధనలు జరుగుతుండగా వీటిలో ఇప్పటికే కనీసం ఐదు వ్యాక్సిన్లు ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకున్నట్లు అంచానా వేశారు. ఇక ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో చేపడుతున్న పరిశోధనలు సెప్టెంబర్ నాటికి పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని సిరం సీఈఓ అధర్ పూనావాలా తెలిపారు.
వ్యాక్సీన్ ఫలప్రదమైన ఫలితాలను ఇస్తుందని తెలిసిన తరువాత రానున్న సంవత్సర కాలంలోనే దాదాపు 40కోట్ల వ్యాక్సిన్ డోసులను తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిపారు. వీటిని భారత్ లోని పుణె కేంద్రంలో ఉన్న రెండు యూనిట్లలో తయారు చేయనున్నారు. ఒక్కో వ్యాక్సిన్ వెయ్యి రూపాయల ధరతో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రజలకు మాత్రం ఇది ఉచితంగానే ప్రభుత్వం అందజేసే అవకాశం ఉంది. అయితే కొవిడ్ వ్యాక్సిన్ తయారీకోసం కొత్తగా ఏర్పాటు చేసే యూనిట్ కోసం రూ. 600కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిరం కంపెనీ బోర్డు ఈమధ్యే ఆమోదం తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more