కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు మే 3వ తేదీ వరకు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఏకంగా తొలి విడతలో 21 రోజుల పాటు మలి విడతలో 19 రోజుల పాటు లాక్ డౌన్ కోనసాగుతోంది. ఇక మరో నాలుగు రోజుల వ్యవధిలో లాక్ డౌన్ ఎత్తివేయనున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తివేస్తారా.? ఎప్పుడు బహ్య ప్రపంచంలోకి వెళ్దామా అనుకునే వారికి ఇది నిజంగా చేదు వార్త,. మే 3 ఎప్పుడోస్తుందాజజ లాక్ డౌన్ గడువు ఎప్పుడు ముగుస్తుందా అనుకునేవారి ఆశలపై నీళ్లు చల్లనుంది కేంద్రం.
ఇప్పటికే మే 2వ తేదీన ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని, లాక్ డౌన్ పై నిర్ణయం తెలుపుతారని సమాచారం. అయితే మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువ అని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. మే 3 తరువాత కూడా కంటైన్మెంట్, రెడ్‌జోన్ ప్రాంతాల్లో ఎలాంటి సడలింపులు ఉండవని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు వస్తున్న కేసులు ఎక్కువగా రెడ్, హాట్‌స్పాట్ ప్రాంతాల నుంచి వస్తున్నాయన్నారు. చాలా రాష్ట్రాలు కరోనా కట్టడి చేస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు కేంద్రం సూచించిన విధంగా మినహాయింపులు ఇచ్చామని మంత్రి తెలిపారు.
కరోనా కట్టడికి కేవలం సామాజిక దూరమే మాత్రమే విరుగుడన్నారు. కాగా డిజాస్టర్ మేనేజ్ మెంట్ చట్టం ప్రకారం కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేర్పులు చేసుకునే హక్కు రాష్ట్రాలకు ఉందన్నారు. గ్రీన్‌జోన్ ప్రాంతాల్లో అన్ని కార్యకలాపాలు కొనసాగుతాయని, గ్రీన్‌జోన్ ఏరియాలో పరిశ్రమలు, మిగతా అన్ని పనులు చేసుకోవచ్చని వెల్లడించారు. సడలింపులు ఉన్న ప్రాంతాల్లో కూడా సామాజిక దూరం, మాస్కులు తప్పక ధరించాలని స్పష్టం చేశారు. పరిస్థితుల ఆధారంగా గ్రీన్ జోన్లలో మరిన్ని వెసులుబాట్లు కల్పిస్తామన్నారు కిషన్ రెడ్డి.
ప్రజా రవాణా సేవలపైనా కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పట్లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టు ప్రారంభించే అవకాశమే లేదన్నారు. మే 3 తర్వాత కూడా బస్సులు, విమానాలు, రైళ్లు నడవవని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏ రాష్ట్ర ప్రజలైనా.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో వారిని సొంత రాష్ట్రాలకు తీసుకుపోవచ్చని ఆయన తెలిపారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని కూడా తీసుకురావడానికి చర్చలు సాగుతున్నాయన్నారు. లక్షలాది మంది ఒకేసారి వస్తే పరిస్థితి ఏంటి అనే దానిపై ఆలోచిస్తున్నామన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more