Liquor, pan stores to open up Except in Red Zones మందుబాబులకు శుభవార్త.. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు..

Lockdown extended liquor sales allowed but with conditions

Coronavirus, Covid-19, alcohol sale, alcohol ban, alcohol in green zones, liquor sale, liquor ban, liquor stores, liquor shops, mha, ministry of home affairs, mha guidelines, flights, favipiravir, mha full form, list of red zones in india, zones of corona in india, red zone

MHA said that liquor and pan shops can open up in except in red zones, provided social distancing in maintained. Further, the ministry specified that no more than 5 persons allowed to crowd at one time at the stores.

మందుబాబులకు శుభవార్త.. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలు..

Posted: 05/01/2020 07:32 PM IST
Lockdown extended liquor sales allowed but with conditions

కరోనా మహమ్మారిని కట్టడి చేసే పనిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డన్ ను మరో పక్షం రోజుల పాటు పెంచుతూ కేంద్రప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, మూడో విడత  లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర మందుబాబులకు శుభవార్తను అందించింది. కరోనా వ్యాప్తి లేని గ్రీన్ జోన్ ప్రాంతాలతో పాటు యాక్టివ్ కేసులు లేని ఆరెంజ్ ప్రాంతాలలోని మద్యం దుకాణాలను తెరిచి విక్రయాలు జరిపేందుకు కేంద్రం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే మద్యం దుకాణాలను తెరవాలంటే అందుకు కొన్న షరతులను తప్పనిసరిగా పాటించాలని కూడా అదేశాలను జారీ చేసింది.

దీంతో మార్చి 24 నుంచి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ తొలివిడత నాటి నుంచి మద్యం కోసం ఎదురు చూస్తున్న మందుబాబుల ఎదురుచూపులు ఎట్టకేలకు ఫలించనున్నాయి. అంతేకాదు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలతో పాటు పాన్, గుట్కా, సిగరెట్లను విక్రమించే పాన్ షాపులను కూడా తెరిచేందుకు కేంద్రం షరతులతో కూడిన అనుమతులను జారీ చేసింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో మద్యం దుకాణాలతో పాటు పాన్ షాపుల వద్ద కూడా తప్పనిసరిగా బౌతిక దూరం పాటించాలని అదేశించింది.

మద్యం దుకాణాల వద్ద విధిగా ఒక్కొక్కరికి మధ్య 6 అడుగుల సామాజిక దూరం ఉండాలని, దుకాణం వద్ద ఒక్కసారి ఐదుగురు వ్యక్తుల కంటే ఎక్కువమంది ఉండరాదని స్పష్టం చేసింది. ఇది గ్రీన్, ఆరెంజ్ జోన్ల వరకే వర్తిస్తుందని కేంద్రం పేర్కొంది. కరోనా కేసులు అధికంగా ఉండే రెడ్ జోన్లలో ఎలాంటి సడలింపులు ఉండవని, ఓ మోస్తరు కేసులుండే ఆరెంజ్ జోన్లలో మద్యం షాపులపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. అంతేకాదు, గ్రీన్ జోన్లలో రవాణ సదుపాయానికి కూడా కేంద్రం అనుమతులు జారీ చేసింది. అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతి ఇస్తూ, 50 శాతం ప్రయాణికులతో బౌతిక దూరం పాటిస్తూ బస్సులు తిప్పేందుకు కూడా కేంద్రం అనుమతించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Red Zone  Orange Zone  Green Zone  containment zones  liquor  pan  tobaco  coronavirus  covid-19  

Other Articles