యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు తెలంగాణ రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయనకు చెందిన భూమిని తదుపతి ఉత్తర్వులు జారీ చేసే వరకు యధాతథా స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం రాష్ట్ర రెవెన్యూ అధికారులకు అదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలో సర్వే నెం.5/3లోని 2083 చదరపు గజాల స్థలాన్ని ప్రభాస్ కొనుగోలు చేశారు. కాగా ఈ స్థలం వివాదాస్పదమైందని పేర్కోంటు దానిని కూల్చివేసేందుకు శేరిలింగంపల్లి రెవెవన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో అధికారుల నోటీసులను వ్యతిరేకిస్తూ ప్రభాస్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక ఈ విషయమై తాజాగా హైకోర్టు స్టేటస్ కో విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
అయితే భూమి వివాదం తేలేవరకూ స్థలాన్ని నటుడు ప్రభాస్‌కు స్వాధీనం చేయడం కుదరదని స్పష్టం చేసిన హైకోర్టు.. సదరు స్థలంలో వున్న నిర్మాణాన్ని ధ్వంసం చేయవద్దని అధికారులకు అదేశించింది. ప్రభాస్ పిటిషన్ పై ఇచ్చిన ఇంజంక్షన్ ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ ప్రభుత్వం దాఖలు చేసిన దరఖాస్తును వీలైనంత త్వరగా పరిష్కరించాలని కింది కోర్టును రాష్ట్రోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విచారించిన కూకట్పల్లి కోర్టు మార్చి 31న ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఏప్రిల్ 3న భవనం తాళం తీయడానికి ప్రయత్నించారు.
శేరిలింగంపల్లి తహసీల్దార్ పోలీసులతో వెళ్లి భవనానికి తిరిగి తాళం వేశారు. ఇంజంక్షన్ ఉత్తర్వులను రద్దు చేయాలని కింది కోర్టులో పిటీషన్ వేశారు. ఆ స్థలంపై గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు భిన్నంగా ఇంజంక్షన్ ఉత్తర్వులు ఉన్నాయని, ఈ భూములకు సంబంధించిన వివాదం హైకోర్టులో ఉందని తెలిపారు. అయితే కింది కోర్టు విచారణ చేపట్టకపోవడంతో రెవెన్యూ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తాజాగా స్టెటస్ కో ఉత్తర్వులను జారీచేసింది. భూవివాదం పరిష్కరం అయ్యే వరకు ఇలానే తమ ఉత్తర్వులను అమల్లో వుంటాయని పేర్కొనింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more