వైసీపీ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా అధికారులపై ఒంటికాలిపైన లేచారు. లాక్ డౌన్ నేపథ్యంలో తాను సామాజిక దూరం నిబంధనలు పాటించలేదని పేర్కోంటూ నోటీసులు జారీ చేసిన అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్, ఎస్పీలు ఏసీ గదుల్లో కూర్చుని పాలన చేస్తున్నారని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కూడా వారికి తెలియదన్నారు. దమ్ము, ధైర్యం ఉంటే తనను అరెస్ట్ చేయాలని.. తాను ఎక్కడికి పారిపోలేదని.. పోలీస్ స్టేషన్ లో కూర్చున్నాని అన్నారు. ఎస్పీని తాను అసలు లెక్క చేయనని.. కలెక్టర్, ఎస్పీ తమ మర్యాదను కాపాడుకోవాలన్నారు.
రాజకీయాలు చేయాలంటే పార్టీలో చేరాలని.. సూచించిన ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు రూల్స్ నేరిపిస్తారా.. తాను ఏసీ గదులకు పరిమితమైన వారివద్ద పాఠాలు నేర్చుకోవాలా అని ప్రశ్నించారు. రూల్స్ పాటించాలని తనకు సూచించినవారు.. జెడ్పీలో యాబై వంద మందితో మీటింగ్ ఎలా పెడతారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి తానే అధికారుల్ని ఆహ్వానించానని.. మరి వారికి నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అధికారులపై చర్యలు తీసుకుంటే తాను ఎంతకైనా తెగిస్తానని.. తానేంటో చూపిస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నెల్లూరు జిల్లా కోవూరు అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి కొద్దిరోజుల క్రితం నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సామాజిక దూరం పాటించకపోవడంతో జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గుంపులుగా చేరేందుకు కారణమైనందుకు, నిబంధనలు అతిక్రమించారనే ఆరోపణలతో ఎమ్మెల్యే నల్లపురెడ్డితో పాటు మరో ఏడుగురుపై 148, 188, 269, 270, 271 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ధర్నాకు దిగారు, పోలీసుల వైఖరికి నిరసనగా తన అనుచరులతో కలిసి బుచ్చిరెడ్డిపాలెం పోలీసు స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే ధర్నా చేపట్టారు. స్వయంగా ఎస్పీ వచ్చి తమను అరెస్టు చేస్తే కానీ అక్కడి నుంచి కదలనని బైఠాయించారు, ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఫోన్ చేసి సముదాయించారు,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more