ధేశవ్యాప్తంగా కరోనావైరస్ నియంత్రణకు కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో రైళ్లు, విమానాలతో పాటు బస్సులు సహా అన్ని ప్రజారవాణాలు స్థంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రీన్ జోన్లలో బస్సులు, ఆటోలు, క్యాబ్ లు నడిపేందుకు కేంద్రం అనుమతులు జారీ చేసింది. కాగా రైల్వే మంత్రిత్వ శాఖ కూడా అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ రైళ్లను నడుపేందుకు సిద్దమైంది. మంగళవారం నుంచి పదిహేను రూట్లలో రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఈ రైళ్లన్ని న్యూఢిల్లీ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరనున్నాయి, అంతేకాదు ఇవే నిర్ణత 15 రూట్లలో నుంచి న్యూఢిల్లీకి కూడా రైళ్లు బయలుదేరునున్నాయి.
ఈ నిర్ణీత రూట్లలో న్యూఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వరకు కూడా రైలు బయలుదేరనుంది. ఇక న్యూఢిల్లీ నుంచి దిబ్రూగడ్, అగర్తల, హవ్డా, పట్నా, బిలాస్ పుర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్ గావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావిల మధ్య నడుస్తాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా పరిగణిస్తారు. ఇవన్నీ రాజధాని రైళ్లు తిరిగే మార్గాలు కావడం గమనార్హం. ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల సౌలభ్యం కోసం ఇవాళ సాయంత్రం నాలుగు గంటల నుంచి అన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఐఆరసీటీసి.
అయితే ఈ రైళ్లలో ప్రయాణించేందుకు రైల్వేస్టేషన్లలో టికెట్లు విక్రయించరు. ఇక రైల్వేస్టేషన్లలోకి కేవలం కన్ఫార్మ్ టికెట్ల వున్న ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. ఇక కన్పార్మ్ టకెట్ ప్రయాణికులు కూడా రైలు బయలుదేరే నిర్ణత సమయానికి గంట ముందుగానే స్టేషన్లకు వచ్చి స్ర్కీనింగ్ పరీక్షలు చేసుకోవాల్సి వుంటుంది. ఇక ఈ ప్రత్యేక రైళ్లలో జనరల్ బోగీలు వుండవు. ఇక టికెట్ కొనుగోలులోనూ ఎవరికీ ఎలాంటి రాయితీలు వుండవు. ఇక ఈ రైళ్లు పరిమిత స్టేషన్లలోనే నిలుపుతారు. రైళ్లలో పూర్తి ఏసీ సదుపాయం వుండటంతో వాటి మేరకే టికెట్ ధరలు కూడా వుంటాయి. ఇక ఈ రైళ్లలో ఒక్క బోగీలో పూర్తి సామర్థ్యంతో 72 ప్రయాణికులను అనుమతించనున్నారు.
Indian Railways has decided for the gradual resumption of passenger train services but existing Shramik special trains will continue to run as per current system on the request of the concerned state governments.#IndiaFightsCorona
— Ministry of Railways (@RailMinIndia) May 10, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more