దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. పలు సడలింపులతో మూడవ విడత లాక్ డౌన్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రతీరోజు మూడువేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి, ఈ క్రమంలో నిన్న ఏకంగా నాలుగు వేలకు దాటిన సంఖ్య ఇవాళ మళ్లీ మూడు వేలకు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 3244 సాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70 వేల మార్కును దాటింది. ప్రతీరోజు మూడు వేల కేసులు నమోదు అవుతుండటం దేశప్రజలను అందోళనకు గురిచేస్తోంది.
ఎలాంటి సడలింపులు లేకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేసిన సందర్భంగా రెండో విడత వరకు రోజుకు వెయి మందికి అటుఇటుగా నమోదైన కేసుల సంఖ్య సడలింపులతో కూడా మూడో విడత లాక్ డౌన్ అమల్లోకి రాగానే కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మూడు వేల 244 పాజిటివ్ కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం 70 వేల 756 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2293కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 87 మరణాలు సంభవించాయి.
దీంతో వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 22,454 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 46,008 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. కాగా, నిన్న సంభవించిన మరణాల్లో అధికంగా మహారాష్ట్ర, గుజరాత్ ల్లోనే అధిక మరణాలు నమోదు కావడం గమనార్హం. ఆ తరువాత ఎక్కవ స్థాయిలో మధ్యప్రదేశ్ లోనే నమోదయ్యాయి.
మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ రాష్ట్రంలో కరోనా కేసులు ఏకంగా 23 వేల మార్కును దాటాయి. నిన్న ఒక్కరోజే 1230 పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఏకంగా 36 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 23,401 కేసులు నమోదు కాగా, మొత్తంగా 868 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి. ఇక గుజరాత్ లోనూ ఇప్పటి వరకు మొత్తం 8541 కేసులు నమోదు కాగా, 513 మంది కరోనాబారిన పడి మరణించారు.
నిన్న ఒక్కరోజునే ఏకంగా 20 మందిమరణించారు. అటు మధ్యప్రదేశ్ లోనూ కోవిడ్ ప్రభావం అధికంగా కొనసాగుతోంది. రాష్ట్రం మొత్తం 3785 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 221 మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ వైరస్ తన ప్రభావాన్ని చాటుతుంది. ఇటు తమిళనాడులోనూ కరోనా వైరస్ పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఏకంగా 798 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 8వేల మార్కు దాటింది. మొత్తంగా 8002 మందికి కరోనా 53 మంది మరణించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more