ధేశవ్యాప్తంగా కరోనావైరస్ నియంత్రణకు కేంద్రప్రభుత్వం లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజారవాణాలు సాధనాలు పూర్తిగా స్థంభించాయి. బస్సులు, రైళ్లు, విమానాలు, నౌకలు అన్ని నిలిచిపోయాయి. కాగా రైల్వే మంత్రిత్వ శాఖ అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ రైళ్లను నడుపేందుకు సిద్దమైంది. మంగళవారమే అందుకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. ఈ నేపథ్యంలో అప్పుడే ఢిల్లీ నుంచి ప్యాసింజర్ రైళ్లను నడపొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. రైలు ప్రయాణాలతో కరోనా వైరస్ వ్యాప్తి అధికం అయ్యే ప్రమాదం కూడా ఉందన్న కేసీఆర్ సందేహం వ్యక్తం చేశారు.
లాక్ డౌన్ మూడు విడత ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ప్యాసెంజర్ రైళ్ల పునరుద్దరణను అప్పుడే వద్దని కోరారు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్ చేయడం సాధ్యం కాదన్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉందని, దీంతో అప్పుడే రైలు ప్రయాణాలను అనుమతిస్తే.. మహానగరాలు కరోనాకు కేంద్రంగా మారిపోతాయనిఅన్నారు, ఇక ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపోయేలా లేదని సీఎం అన్నారు. కరోనాతో కలిసి బతకడం తప్పదని అభిప్రాయపడ్డారు.
కరోనా వల్ల ఈ ఆర్థిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున రుణాలను రీషెడ్యూల్ చేయాలని సీఎం కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల రుణ పరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. వలస కూలీలను అనుమతించకపోతే ఆందోళనలు పెరిగే అవకాశం ఉందన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలన్నారు. కరోనా వైరస్‌కు జులై, ఆగస్టు మాసాల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అవ్వగా.. భారత్ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచే ఈ వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తంచేశారు. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more