Cop Pulls A Stunt From Old Ajay Devgn Movie, Fined ప్రశంసలు అందుకోవాల్సిన చోట.. ఫైన్.. పోలీసు అధికారి షాక్..!

Watch singham stunt mp cop fined for balancing self on two moving cars

Singham, 'Singham' stunt, SI finned, Ajay Devgn, balancing on two cars, manoj yadav, Madhya Pradesh, MP police, Madhya Pradesh police

A Madhya Pradesh Police sub-inspector was fined Rs 5,000 after he performed a daredevil act of balancing himself on two moving cars, copying the famous stunt from Ajay Devgn-starrer 'Singham'.

ప్రశంసలు అందుకోవాల్సిన చోట.. ఫైన్.. పోలీసు అధికారి షాక్..!

Posted: 05/12/2020 03:20 PM IST
Watch singham stunt mp cop fined for balancing self on two moving cars

స్టంట్ మాస్టార్ తనయుడిగా.. చిన్ననాటి నుంచి స్టంట్లు చూస్తూనే ఎదిగాడు.. బాలీవుడ్ హీరోగా తనదైన సాహసోపేత విన్యాసాలతో ప్రేక్షకులను అలరించాడు హీరో అజయ్ దేవగణ్. ఆయన సినిమాలో చేసిన స్టంట్ ను తాను చేయగలనని దేశవ్యాప్తంగా అనేకమంది అనుకరిస్తూ వుంటారు. అయితే ఇలా స్టంట్ల చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారు లేకపోలేరు. అప్పట్లో బాహుబలి చిత్రంలో స్టంట్ ను చేయబోయి పలువురు ప్రాణాలను కూడా కోల్పయిన విషయం తెలిసిందే.

అయితే ఇలా ఎవరైనా స్టంట్లు వగైరాలు చేస్తే వారిని అదుపులోకి తీసుకుని ఇలాంటివి తగదని చెప్పాల్సిన ఓ పోలీసు అధికారి తానే ఇలాంటి విన్యాసాలను చేస్తే.. అంతేకాదు తన విన్యాసంపై ప్రశంసలను ఆశిస్తే.. అవి దక్కక ఎక్కడికిపోతాయి. ఇక ఓ పోలీసు అధికారి విన్యాసాన్ని అటు మంచిగానూ, ఇటు మరోకోణంలోనూ చూసేవారి సంఖ్య కూడా పెరగడంతో ఆయన వీడియో కాస్తా వైరల్ అయ్యింది. దీంతో ఆయన ఉన్నతాధికారుల దృష్టికి కూడా వీడియో వెళ్లింది. దానిని చూసిన వారు ఆయనకు ప్రశంసలకు బదులు ఫైన్ వేశారు. అంతేకాదు మరోసారి ఇలాంటి స్టంట్లు పునరావృతం కానీయవద్దని వార్నింగ్ ఇచ్చారు.

ఎందకంటారా..? పోలీసు దుస్తులు ధరించి రెండు కార్లపై నిల్చొనే స్టంట్‌ చేసిన అధికారి వీడియో వైరల్ కావడంతో విచారణ జరపిన ఉన్నతాధికారులు మండిపడ్డారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దామోహ్ జిల్లాలోని నార్సింగ్ గర్హ ఎస్సై మనోజ్ యాదవ్ అజయ్ దేవగణ్ సింగం చిత్రంలోని రెండు కార్లపై వెళ్లే స్టంట్ ను అనుకరించాడు. పోలీసు దుస్తుల్లో ఇలా చేస్తూ వీడియో చిత్రీకరించుకుని దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది, దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఎస్సై మనోజ్ యాదవ్ కు రూ.5 వేల జరిమానా వేశారు. ఇలాంటి వీడియోలు మరోసారి చేయొద్దని హెచ్చరించారు. అలాంటివి ప్రమాదకరమని, యువతపై ప్రభావం చూపుతాయని మందలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles