దేశంలో కరోనా విజృంభన వేగంగా కోనసాగుతోంది. మరిన్ని సడలింపులతో నాల్గవ విడత లాక్ డౌన్ మరో రెండు రోజుల్లో అమల్లోకి రానుండటంతో.. గత పక్షం రోజుల నుంచి ప్రతీరోజు మూడువేల కేసులు నమోదు అవుతుండగా ఇక గత వారం రోజు లనుంచి రమారమి నాలుగు వేలకు ఈ కేసులు చేరుతున్నాయి, దీంతో గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 3970 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86 వేల మార్కుకు చేరింది. ప్రతీరోజు మూడు వేల కేసులు నమోదు అవుతుండటం దేశప్రజలను అందోళనకు గురిచేస్తోంది.
ఎలాంటి సడలింపులు లేకుండా కఠినంగా లాక్ డౌన్ అమలు చేసిన సందర్భంగా రెండో విడత వరకు రోజుకు వెయి కేసులు నమోదు కాగా, మూడో విడత లాక్ డౌన్ అమల్లోకి రాగానే కేసులు సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మూడు వేల 970 పాజిటివ్ కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం 86 వేల 940 మందిని ఈ మహమ్మరి తన ప్రభావానికి గురిచేసింది. ఇక కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 2752కు చేరింది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 103 మరణాలు సంభవించాయి.
దీంతో వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకు 30,153 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 53,035 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. గతకొన్ని రోజులుగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోండగా, రానున్న రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశాలు వున్నాయని నిపుణులు అంచనాలు ప్రజలను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 34.06 శాతం మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. కాగా, కరోనా ప్రభావం అధికంగా మహారాష్ట్ర, గుజరాత్ ల్లోనే నమోదు కావడం గమనార్హం.
దేశంలో కరోనావైరస్ బారిన పడి మరణించిన వారిలో అత్యదికులు మహారాష్ట్ర వాసులే కావడం గమనార్హం. నిన్న ఒక్కరోజే 1576 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 29100 కేసులు నమోదు కాగా, మొత్తంగా 1068 మంది అసువులుబాసారు. మహారాష్టలో నమోదైన కేసుల్లో అత్యధికంగా దేశ అర్థిక రాజధాని ముంబైలోనే నమోదయ్యాయి. గుజరాత్ నుంచి స్వస్థలాలకు వెళ్లున్న కార్మికుల్లో కరోనా బయటపడటంతో అందోళన కలుగిస్తోంది. ఇక గుజరాత్ లోనూ మొత్తం 9931 కేసులు నమోదు కాగా, 606 మంది కరోనాబారిన పడి మరణించారు.
తమిళనాడులోనూ పెద్ద సంఖ్యలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో మొత్తం కేసులు సంఖ్య 10108కు చేరగా, 71 మరణాలు సంభవించాయి. ఆ తరువాత దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. మొత్తం కరోనా కేసులు 8470కు చేరగా, 115 మరణాలు నమోదయ్యాయి, ఆ తరువాత మధ్యప్రదేశ్ లో ఇప్పటి వరకు మొత్తం 4595 కేసులు నమోదు కాగా, 239 మంది మరణించారు, పశ్చమ బెంగాల్ లో 2461 కేసులు నమోదు కాగా, 225 మంది మరణించారు. ఇక రాజస్థాన్ లో 4727 కేసులు నమోదు కాగా మొత్తం 125 మరణాలు సంభవించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more