హైదరాబాద్లో ఎంఐఎం ఎమ్మెల్యే లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించడం వివాదాస్పదంగా మారుతోంది. ఎమ్మెల్యేగా కొనసాగుతూ.. ప్రజాప్రతినిధిగా తాను ముందుగా ప్రభుత్వం జారీ చేసిన అదేశాలను పాటించాల్సిందిపోయి.. తానే దగ్గరుండి వాటిని ఉల్లంఘించడం వివాదాస్పదమవుతోంది. లాక్ డౌన్ లో రోడ్డుపై అడ్డంగా ఉంచిన భారీకేడ్లను తొలగించి వాహనదారులకు అనుమతిస్తున్న ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మలక్ పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బాలాలా దగ్గరుండి భారీకేడ్లు తొలగింపజేస్తుండడంపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రోడ్డుపై వాహనాలు వెళ్లకుండా అడ్డుగా ఏర్పాటు చేసిన భారీకేడ్లు తొలగింపజేసి వాహనదారులకు ఆయన స్వయంగా అనుమతించారు. ఇందుకు పోలీసులు కూడా సహకరించడం గమనార్హం. డబీర్పుర పీఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఇక స్వయంగా ఎమ్మెల్యేనే భారీకేడ్లు తొలగించడంతో అక్కడే వున్న పోలీసులు చేష్టలుడికి చూస్తుండిపోయారు. దీంతో పోలీసులు కూడా స్వరం మార్చారు. ఎమ్మెల్యేపే లాక్ డౌన్ ఉల్లంఘనల కింద కేసు బనాయించాల్సిన పోలీసులు.. అందుకు భిన్నంగా తామే వాటిని తొలగించామని చెప్పడం గమనార్హం. దీనిపై డబీర్ పుర ఇన్ స్పెక్టర్ను బీజేపి స్థానిక నేతలు వివరణ కోరగా తామే భారీకేడ్లు తీయించినట్లు చెప్పారు.
పాత బస్తీలో ఎమ్మెల్యే నాయకుల దౌర్జన్యానికి హద్దు లేకుండా పోయిందని రూప్ రాజ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇటీవల మాజీ మేయర్ పోలీసులను బెదిరించినా కేసు నమోదు చేయలేదని గుర్తు చేశారు. ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, నాయకుల ఆగడాలు పెరిగిపోయాయని విమర్శించారు. ఈ ఘటనలు సీఎం కేసీఆర్కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ప్రపంచమంతా కరోనాను తరిమికొట్టేందుకు లాక్ డౌన్ పాటిస్తుంటే, హైదరాబాద్లో మాత్రం ఎంఐఎం నేతల వల్ల అది సాధ్యం కావడం లేదని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more