APSRTC resumed its services today ఏపీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరద్దరణ

After nearly 2 months apsrtc bus services resumed today

Visakhapatnam, Vijayawada, Bus Services, Bus, APSRTC News, APSRTC, Coronavirus, Covid-19

The APSRTC is set to partially restore bus services almost after two months of lockdown. APSRTC bus services resumed on select routes initially and they will scale up the operations based on the progress in containing the spread of Covid-19.

ఏపీఎస్ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం: పరుగులు పెడుతున్న ప్రగతి చక్రం

Posted: 05/21/2020 10:53 AM IST
After nearly 2 months apsrtc bus services resumed today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రెండునెలల తరువాత ప్రగతి చక్రం పరుగులు పెట్టింది. ఇవాళ్టి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. రాష్ట్రంలో బస్సులు రోడ్డక్కడంతో బస్టాపుల్లో ప్రయాణికులతో కళకళలాడాయి. లాక్ డౌన్‌ కారణంగా గత 58 రోజులుగా బస్సులన్నీ డిపోలకే పరిమితమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం లాక్ డౌన్‌ ఆంక్షలు సడలించడంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే కరోనా తీవ్రత అధికంగా వున్న విజయవాడ, గుంటూరు, విశాఖ సిటీ సర్వీసులు మాత్రం నడవడం లేదు. అయితే ఈ బస్సుల్లో ప్రయణానికి ఆన్ లైన్‌ బుకింగ్‌ తప్పనిసరి.

అయితే బస్సు సర్వీసులు రాష్ట్రంలో కేవలం 17 శాతం మాత్రమే నడుపుతున్నామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తరువాత దశలవారీగా పూర్తి స్థాయిలో సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆర్టీసీకి మొత్తం 12వేల బస్సులు ఉండగా 436 మార్గాల్లో 1,683 బస్సులు మాత్రమే నడపనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీని బట్టి దశలవారీగా బస్సుల సంఖ్య పెంచుతామని చెబుతున్నారు. అయితే ఆర్టీసీ బస్సు ప్రయాణాల్లో సామాజిక దూరం పాటించడంతో పాటు మాస్కులు కూడా తప్పనిసరి చేశామన్నారు.

ఇక ఇవాళ్టి నుంచి ప్రారంభమైన ఆర్టీసీ బస్సుల్లో ఎలాంటి రాయితీలు వర్తించడంలేదు. డిజిటల్ లావాదేవీల రూపంలో, లేదా యూపీఐ విధానంలో టికెట్లు జారీ చేస్తున్నారు. అన్ రిజర్వుడ్ (టికెట్లు లేకుండా) వచ్చిన ప్రయాణికుల కసం బస్సు ఎక్కేముందు టికెట్ తీసుకునే వెసలుబాటు కల్పిస్తున్నారు. ఇందుకోసం అన్ని బస్టాండ్లలోనూ కరెంట్‌ బుకింగ్‌ సదుపాయం కల్పించారు. కౌంటర్లో టికెట్‌ కొనుగోలు చేసేవారి పేరు, ఫోన్‌ నంబరు నమోదు చేసుకుంటున్నారు. 65 ఏళ్లు పైబడినవారు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయొద్దని సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Visakhapatnam  Vijayawada  Bus Services  Bus  APSRTC News  APSRTC  Coronavirus  Covid-19  

Other Articles