కరోనావైరస్ ప్రభావాన్ని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి. ప్రజలు బయటి ఆహారా పదార్థాలపై ఆధారపడకూడదని, ఇంట్లోనే వండుకుని వేడివేడిగా తినాలని కూడా సూచించాయి. ఈ నేపథ్యంలో గత 55 రోజులుగా వ్యాపారాలను కొల్పోయిన ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు ఇక నాల్గవ విడత లాక్ డౌన్ లో భాగంగా కేంద్రప్రభుత్వం కల్పించిన సడలింపులతో మళ్లీ రంగంలోకి దూసుకొచ్చాయి. అంతేకాదు తాము కొల్పోయిన వ్యాపారం మొత్తాన్ని కూడా రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అందులో భాగంగా ఆహారాన్నే కాకుండా ఏకంగా మద్యాన్ని కూడా సరఫరా చేయడాన్ని ఇవాళ్టి నుంచే ప్రారంభించాయి. మద్యాన్ని కూడా వినియోగదారులకు హోం డెలివరీని చేసే సదుపాయాన్ని ఇవాళ్టి నుంచి ప్రారంభించాయి, ప్రస్తుతానికి తమ సేవలు జార్ఖండ్‌లోని రాంచితో ప్రారంభమయ్యాయని తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. కాగా ఆ రాష్ట్రంలోని మరిన్ని పట్టణాలకు కూడా ఓ వారంలోగా తమ సేవలను విస్తరిస్తామని స్విగ్గీ వెల్లడించింది. కాగా, ఇతర రాష్ట్రాల్లో కూడా తమ సేవలను విస్తరించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. తమ కంపెనీ యాప్‌లో ‘‘వైన్ షాప్స్’’ విభాగంలో ఆన్లైన్ మద్య సరఫరా సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ అధికారులు తెలిపారు.
ఆన్ లైన్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, వినియోగదారుల ఇంటి వద్దకే మద్యాన్ని సరఫరా చేసేందుకు గాను తాము లైసెన్సు, అవసరమైన ఇతర అనుమతులు కలిగిన స్థానిక దుకాణాలతో ఒప్పందాలు చేస్తున్నామని స్విగ్గీ వివరించింది. అమలులో ఉన్న లాక్ డౌన్, కరోనా వైరస్ తదితర నిబంధనలను తాము పాటిస్తామని... వినియోగదారు చిరునామా, వయస్సు తదితర వివరాలు నిర్ధారించుకున్న అనంతరం మాత్రమే వారికి మద్యాన్ని అందచేస్తామని సంస్థ అధికారులు వివరించారు. ఈ విధంగా నిబంధనలకు లోబడి హోం డెలివరీ సేవలు అందించటం ద్వారా రిటైల్ మద్యం దుకాణాలకు కూడా అదనపు వ్యాపారాన్ని అందించినట్టు అవుతుందని స్విగ్గీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more