దేశీయ విమాన ప్రయాణాలకు శుభవార్తను అందించిన కేంద్రం.. తాజాగా ఈ ప్రయాణాలకు కొత్త ధరలను కూడా నిర్ధేశించింది. దేశీయ విమాన సర్వీసులు ఈ నెల 25 నుంచి దశల వారీగా సేవలు మొదలవుతాయని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీ వెల్లడించిన నేపథ్యంలో కొత్త ధరలను కూడా నిర్ణయించింది కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వశాఖ. మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు గాల్లోకి ఎగరనున్నాయి. ఈ నేపథ్యంలో విమాన టికెట్ ధరలను కేంద్రం సవరించింది.
విమాన ప్రయాణ సమయం ఆధారంగా 7 కేటగిరీలుగా చార్జీలు ఉంటాయి. ఢిల్లీ-ముంబై రూట్లో టికెట్ ధర గరిష్టంగా రూ.10వేలుగా ఉంటుంది. విమానాల్లో 40 శాతం సీట్లు బ్రాండ్ మిడ్ పాయింట్ కంటే తక్కువ ధరకు అమ్ముతారు. ఢిల్లీ-ముంబై మార్గాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. కనిష్ట ధర రూ. 3500, గరిష్ట ధర రూ.10,000కు మిడ్ పాయింట్ ధర 6700. అంటే ఈ మార్గంలో రూ.6700 కంటే తక్కువ ధరకే 40శాతం టికెట్లను అమ్ముతారు. ధరలను నియంత్రించేందుకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు DGCA తెలిపింది. మే 25 నుంచి ఆగస్టు 24 వరకు టికెట్ ధరల విషయంలో ఇదే విధానం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే గతంతో ఈ ధరలను పొల్చిచే మాత్రం ధరలు పెరిగాయని పలువురు పెదవి విరుస్తున్నారు.
టికెట్ ధరల వివరాలు: (కనిష్ట- గరిష్ట ధరలు)
* సెక్టార్- ఎ 40 నిమిషాల లోపు ప్రయాణం - Rs. 2000 to 6000
* సెక్టార్- బి 40-60 నిమిషాల ప్రయాణం - Rs. 2500 to 7500
* సెక్టార్- సి 60-90 నిమిషాల ప్రయాణం - Rs. 3000 to 9000
* సెక్టార్- డి 90-120 నిమిషాల ప్రయాణం - Rs. 3500 to 10,000
* సెక్టార్- ఈ 120-150 నిమిషాల ప్రయాణం - Rs. 4500 to 13,000
* సెక్టార్-ఎఫ్ 150-180 నిమిషాల ప్రయాణం - Rs. 5500 to 15,700
* సెక్టార్- జి 180-210 నిమిషాల ప్రయాణం - Rs. 6500 to 18,600
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more