కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కడా జనసందోహంతో కూడిన కార్యాలు చేయకూడదని, పెళ్లిళ్లు, మరణాలకు మాత్రమే ప్రస్తుతానికి పరిమితి సంఖ్యలో అనుమతి వుందని అధికారులు ఎన్నో ఆంక్షలు పెడుతున్నా.. దానిని ప్రజలు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రతీ ఏడాది చేసుకునే వేడుకను ఈ సారి లాక్ డౌన్ ఆంక్షల నడుమ కూడా చేసుకుని తన బంధుమిత్రుల ప్రాణాల మీదకు తీసుకువచ్చాడో మాంసం వ్యాపారి. అంతేకాదు తన కుటుంబంలోని 14 మందికి కూడా కరోనా మహమ్మారి సోకేందుకు కారణమయ్యాడు. లోకం ఎంత అందోళన చెందుతుందోనన్న విషయాన్ని మర్చి తన సరదాలు మాత్రం తీరాల్సిందేనని పూనుకున్నారు. ఫలితంగా 22 మంది కరోనా బారిన పడేవారే కాదు.
తన ఇంట్లో జరిగిన వేడుకలో కరోనా ఎలా ప్రవేశిస్తుందని అనుకున్నాడో ఏమో కానీ.. కరోనా బారిన తన కుటుంబంతో పాటు బంధుమిత్రులు కూడా చికిత్స పోందుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ శివారు ఫహాడీషరీఫ్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పహాడీషరీఫ్ లో ఓ మాంసం దుకాణం వ్యాపారి కుటుంబం నివాసం ఉంటోంది. ప్రతి ఏడాది వేసవి కాలంలో ఈ కుటుంబానికి చెందిన పలువురు స్నేహితులు, బంధువులతో కలసి ఒకచోట చేరి సరదాగా వేడుకలు జరుపుకుంటారు. యధావిధిగా ఈ ఏడాది పార్టీ చేసుకోవాలని సంకల్పించారు. యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి కళారా నృత్యానికి జడుస్తూ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్న తరుణంలో ఈ నాలుగు కుటుంబాలు మాత్రం పది రోజుల క్రితం పార్టీ పేరుతో సరదాను తీర్చుకున్నాయి. అంతా అకయ్యాక వారిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
అయితే వీరితో పాటు నగరంలోని కరోనా ప్రభావిత హాట్ స్పాట్ గా నిలిచిన జియాగూడ నుంచి కూడా పార్టీకి పలువురు హాజరయ్యారు. వీరితో పాటు గౌలిపురా, బోరబండ ప్రాంతాల నుంచి ముగ్గురి చొప్పున, సంతోష్ నగర్ నుంచి ఐదుగురు మొత్తంగా మరో 14 మంది పార్టీలో భాగమయ్యారు. మొత్తంగా 45 నుంచి 50 మంది వరకు ఈ పార్టీకి హాజరై వేడుక చేసుకున్నారు. కాగా, ఈ పార్టీకి హాజరైన వారిలో 18 మంది మటన్ వ్యాపారి ఇంట్లో పార్టీ వేడుకలు ముగించుకుని మహేశ్వరం మండలం హర్షగూడలో కిరాణ దుకాణం నడిపించే బంధువు ఇంటికి వచ్చారు. అతడి కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి మరోసారి పార్టీ చేసుకున్నారు.
ఐదు రోజుల తరువాత ఈ పార్టీకి హాజరైన వారిలో ఐదుగురికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. సంతోష్ నగర్ కు చెందిన ఇద్దరితో పాటు బోరబండకు చెందిన ముగ్గురిలో కరోనా లక్షణాలు కన్పించడంతో వారికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ కేసులుగా నిర్థారణ అయ్యింది. దీంతో పహాడీ షరీఫ్ లో మాంసం వ్యాపారి ఇంట్లో జరిగిన వేడుకల విషయం వైద్యాధికారుల దృష్టికి చేరింది. దీంతో ఈ వేడుకలకు హాజరైన వారందరి జాబితాను తెలుసుకున్న అధికారులు వారందరినీ ఈ నెల 23 నుంచి హోం క్వారంటైన్ లో ఉంచారు. ఇక తాజాగా వీరిందరికీ పరీక్షలు చేయగా, అందులో 13 మందికి పాజిటివ్‌గా తేలింది. ఆ వేడుకలకు హాజరైన కిరాణ వ్యాపారి కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా వారందరికీ కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more