BPCL launches cooking gas booking via WhatsApp వాట్సప్ లో గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయం.. ఎవరికో తెలుసా.?

Bpcl launches new feature for customers book cooking gas via whatsapp

BPCL customer, cooking gas, bpcl gas booking on whatsapp, bpcl whatsapp booking number, LPG customers, BPCL Smartline number, bpcl customewr care service, bpcl cooking gas

The second-largest national oil marketing company Bharat Petroleum Corp Ltd (BPCL) announced a new customer-friendly initiative with the launch of cooking gas booking through Whatsapp across the country.

వాట్సప్ లో గ్యాస్ బుక్ చేసుకునే సదుపాయం.. ఎవరికో తెలుసా.?

Posted: 05/27/2020 06:48 PM IST
Bpcl launches new feature for customers book cooking gas via whatsapp

ఎల్పీజీ సబ్సీడి సిలిండర్ వాడే గృహస్తులకు ఎల్పీజీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. తాము కూడా స్మార్ట్ అయ్యామని.. ఎంతలా అంటే కొన్ని సంస్థలు పేటియం, ఫోన్ పే యాఫ్ ద్వారా సిలిండర్లను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించేంత. అయితే తాజాగా స్మార్ట్ ఫోన్ వినియోగాదారులందరికీ సుపరిచితం అయిన వాట్సప్ తో ఇక ఎల్పీజీ సిలిండర్ ఇంటికి తెప్పించుకోవచ్చు. సిలిండర్ బుక్ చేయడానికి గత కొన్నేళ్లుగా ఎంతో శ్రమకోర్చి.. అర్థమయ్యి, అర్థంకాని అటోమేటడ్ కాల్ప్ లో గ్యాస్ బుక్ చేసుకున్న వాళ్లు ఇప్పడిక ఆ కష్టం నుంచి విముక్తి లభించింది. దీంతో పైఃసా ఖర్చు లేకుండా సిలిండర్ బుక్ చేసుకునే సదుపాయి కలింది. అందుకు మీ ఫోన్‌లో వాట్సప్ ఉంటే చాలు, ఈజీగా సిలిండర్ బుక్ చేయొచ్చు.

సాధారణంగా వంట గ్యాస్ సిలిండర్‌ కోసం ఇన్నాళ్లు ఫోన్ ద్వారా బుకింగ్ చేసుకున్న పధ్దతికి ఇక చీటి చెల్లిపోయింది. ఇకపై వాట్సాప్‌ నుంచి గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వరంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(బీపీసీల్) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విధానం ఇవాళ్లి నుంచే దేశవ్యాప్తంగా వున్న 7.1 కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో రెండో అతిపెద్ద గ్యాస్ ఏజెన్సీ అయిన బిపిసీఎల్.. తమ కస్టమర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. ఈ కస్టమర్లు వాట్సప్ నుంచి సిలిండర్ బుక్ చేయడానికి బీపీసీఎల్ స్మార్ట్ లైన్ నెంబరు ప్రారంభించారు. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1800224344 నెంబరుకు వాట్సప్ లో మెసేజ్ చేస్తే చాలు. సిలిండర్ బుక్ అవుతుంది.

ఎలా బుక్ చేసుకోవాలంటే..

 

ముందుగా బీపీసీల్ కంపెనీ అఫీషియల్ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 1800224344 అనే వాట్సాప్ నెంబర్ ద్వారా సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చునని సూచించింది. ఇందుకు ముందుగా బీపీసీఎల్ స్మార్ట్‌లైన్ నెంబర్‌ 1800224344 సేవ్ చేసుకోవాలి. మొదట Hi (హాయ్) అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత బుక్ (Book) లేదా 1 అని మెసేజ్ చేయాలి. తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మెసేజ్ లో పేమెంట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, ఇతర వ్యాలెట్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. దీంతో అటు ఎల్పీజీ సిలిండర్ డెలివరీ బాయ్స్ అధికమొత్తంలో డబ్బులు తీసుకునే పద్దకి కూడా చెక్ పడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bharat gas  BPCL  LPG Cylinder  whatsapp  gas booking  bpcl new feature  Bharat Petroleum  LPG Customers  

Other Articles