కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు హడలెత్తిపోతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఎక్కడి నుంచి కరోనా మహమ్మారి వస్తుందోనని.. ప్రభుత్వాలే లాక్ డౌన్ ప్రకటిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్న సందర్భంలో.. కొందరు అసుపత్రి పిబ్బంది వహించే నిర్లక్షానికి మొత్తం వైద్య సిబ్బంది విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆలాంటి అనూహ్యమైన ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. నగరంలో సంచరిస్తున్న ఓ వానరాల గుంపు ఆకస్మికంగా మీరట్ లోని మెడికల్ కాలేజీలోకి వెళ్లి కరోనా అనుమానితుల నుంచి సేకరించిన శాంపిళ్లను ఎత్తుకెళ్లాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
వివరాల్లోకి వెళ్తేు.. మీరట్ వైద్య కళాశాలకు చెందిన ముగ్గురు సిబ్బంది కొవిడ్-19 అనుమానితుల నుంచి శాంపిళ్లు తీసుకుని వెళ్తుంతుండగా ఓ కోతుల గుంపు దాడి చేసింది. వారి చేతుల్లోని కరోనా రోగుల రక్త నమూనాలను ఎత్తుకెళ్లాయి. ఇక ఆ శాంపిళ్లను తినే వస్తువులని భావించిన కొతులు చెట్ల మీదుకు వెళ్లివాటిని నోటితో కోరకడం కనిపించింది. శాంపిళ్లను కొరకడంతో కోతులకు కరోనా వైరస్ సోకుతుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు వీటి ద్వారా వైరస్ స్థానికలకు కూడా సోకుతుందని వైద్యులు కలవరం చెందుతున్నారు.
ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ శాంపిళ్ల ద్వారా మనుషులకు కూడా కరోనా వ్యాధి సోకుతుందేమోనని స్థానికులు సైతం భయాందోళనకు గురవుతున్నారు. వాటి వల్ల కరోనా వైరస్ ఎక్కడ సోకుతోందనని భయపడుతున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు మెడికల్ కళాశాల సూపరింటిండెంట్ డాక్టర్ ధీరజ్ బాల్యన్ తెలిపారు. దీనిపై అటవీ అధికారులకు తెలియజేసినా వారు కోతులను పట్టుకోలేదని తెలిపారు. మరోవైపు శాంపిళ్లను ఎత్తుకెళ్లడంతో అనుమానితుల నుంచి మరోసారి శాంపిళ్లను సేకరించారు.
In Meerut Monkeys run away with covid 19 samples #coronavirusinindia pic.twitter.com/NGLn35eCez
— Tarun Goyal (@omtechsoftwares) May 29, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more