దేశంలో కరోనా విజృంభన కోనసాగుతోంది. మరీ ముఖ్యంగా దేశంలో లాక్ డౌన్ ఎత్తివేతకు కేంద్రం పలు సడలింపులను ఇచ్చిన నాటి నుంచి కరోనా వ్యాప్తి శరవేగాన్ని అందుకుంది. రోజుకు ఐదు వేల కేసులు వెలుగుచూసిన దేశంలో సడలింపులిచ్చిన నాటి నుంచి ఏకంగా దేశంలో రోజువారి వ్యాప్తి సంఖ్య రెట్టింపుకు చేరింది. ఒక దశలో దేశంలో ఏం జరుగుతుందో.. పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చసుకునే లోపు మారిపోతున్నాయి. ఇదే పరిస్థితిని ముందే ఊహించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ రాష్ట్రవాసుల కోసం ఆసుపత్రులలో బెడ్ లు రిజర్వు చేయాలని అసుపత్రులకు ఇచ్చిన అదేశాలను ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఏ స్థాయిలో విస్తరిస్తోందో డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అంచనా వేశారు. ఓ రకంగా ఢిల్లీలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి స్థాయికి చేరుకుంటుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జులై 31 నాటికి ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య ఐదున్నర లక్షలకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. అప్పటికి ఢిల్లీకి 80 వేల బెడ్లు అవసరమవుతాయని తెలిపారు. ఈ నెలాఖరుకి 15 వేల బెడ్లు అవసరమవుతాయని చెప్పారు. పేషెంట్లకు బెడ్లు దొరక్క చాలా ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తుతుందని అన్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో ఆయన కరోనా ప్రభావం, పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియాతో సిసోడియా మాట్లాడుతూ ఈ మేరకు ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఢిల్లీలో 12 రోజుల వ్యవధిలో కరోనా వ్యాప్తి రెట్టింపు అవుతుందని, ఈ క్రమంలో ఈ నెల 15 నాటికి 44 వేల కేసులు, నెలాఖరు నాటికి లక్ష కేసులు.. జూలై 15 నాటికి 2.25 లక్షల కేసులు, జూలై నెలాఖరు నాటికి ఢిల్లీలో ఐదున్నర లక్షల కేసులు నమోదవుతాయని ఆయన అంచనావేశారు. కాగా, ఇప్పటి వరకైతే ఢిల్లీలో కరోనా వైరస్ సామూక వ్యాప్తి లేదని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలుపుతోందని సిసోడియా చెప్పారు. అయితే అంతకు ముందు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ మీడియాతో మాట్లాడుతూ, నగరంలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి ఉందని తెలిపారు. వైరస్ ఎవరి నుంచి ఎలా సోకిందో కూడా తెలియని కేసులు సగానికి పైగా నమోదవుతున్నాయని చెప్పారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 27,654 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 10,664 మంది కోలుకున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more