Petrol, diesel price hiked for 5th day today వరుసగా ఐదోరోజు పెరిగిన ఇంధన ధరలు..

Petrol diesel price hiked for 5th day today

petrol price hike, diesel price hike, fuel price hike on june 10, 2020, VAT, daily pricing of petrol and diesel, ONGC, IOC, HPCL, BPCL, Oil and Gas Ministry, inflation

State-run oil marketing companies today hiked the price of petrol and diesel for the fifth consecutive day. The price of both petrol and diesel went up by 60 paise a litre each today. During the last five days, the price of petrol has gone up by ₹2.74 a litre and that of diesel by ₹2.83 a litre in New Delhi.

అంతర్జాతీయంగా పెరిగిన బ్యారెల్ ధర.. వరుసగా ఐదోరోజు పెరిగిన ఇంధన ధరలు..

Posted: 06/11/2020 04:53 PM IST
Petrol diesel price hiked for 5th day today

అంతర్జాతీయంగా ఇంధనాని డిమాండ్ పెరుగుతుండటంతో ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ టో గత నెలలో వున్న బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర ఏకంగా రెట్టింపు ధరకు ఎగిసింది. గత నెలలో వున్న ధరకు ఈ నెలలో బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర ఏకంగా రెట్టింపు ధరకు చేరి నలభై డాలర్ల ధర పలుకుతోంది, దీని ప్రభావం దేశంలోని ఇంధన సంస్థలు కూడా ధరలను పెంచుతున్నాయి, దేశంలో గత ఐదు రోజులుగా వరుసగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. అటు పెట్రోల్ తో పాటు ఇటు డీజీల్ ధరలు కూడా వరుసగా ఐదో రోజు పెరిగాయి.

దేశంలో లాక్ డౌన్ సమయంలో మారని ధరలు, ఆపై అన్ లాక్ 1.0 ప్రారంభమైన తరువాత, రోజూ పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్ నెలతో పోల్చితే గత నెలలో ఇంధన ధరల వినియోగం పెరిగిందని, గత నెలలో ఏకంగా రెట్టింపు వినియోగం అయ్యిందని దేశ అతిపెద్ద రిఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. ఈ నేపథ్యంలో వరుసగా ఐదో రోజూ ధరలు పెరిగాయి. గురువారం నాడు లీటరుపై 60 పైసల మేరకు ధరను పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వెల్లడించాయి. దీంతో ఈ ఐదు రోజుల్లో పెట్రోలు ధర లీటరుకు రూ. 2.74 మేరకు పెరిగినట్లయింది.

ఇక ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే, న్యూఢిల్లీలో పెట్రోలు  రూ. 74. డీజిల్   రూ. 72.22కు చేరగా, గుర్గావ్ లో పెట్రోల్ ధర 73.32 డీజిల్ 65.36, ముంబైలో పెట్రోల్  రూ. 80.98. డీజిల్  రూ. 70.92కు చేరాయి. ఇదే సమయంలో చెన్నైలో పెట్రోల్ రూ. 77.96. డీజిల్ రూ. 70.64కు పెరుగగా, బెంగళూరులో పెట్రోల్ రూ. 76.39. డీజిల్ రూ. 68.66కి, హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 76.82. డీజిల్ రూ. 70.59కు, అమరావతిలో పెట్రోల్  రూ. 77.36. డీజిల్ రూ. 71.18కు చేరుకున్నాయి. పలు రాష్ట్రాల్లో వ్యాట్ ధరలు అధికంగా వుండటం కూడా ధరలు అధికంగా పెరగడానికి కారణం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : petrol price  diesel price  fuel price  price of fuel  crude price  excise  VAT  

Other Articles