Coronavirus: India reports record 20903 cases in a day దేశంలో 6లక్షలు ధాటిన కేసులు.. 18 వేల మరణాలు

Coronavirus cases in india tally crosses 6 lakh nearly 17000 dead

Coronavirus cases India, Coronavirus India update, Coronavirus india testing centres, coronavirus vaccine, coronavirus testing india labs, coronavirus deaths india, Coronavirus, Covid-19, Maharashtra, Tamil Nadu, Delhi, Health Ministry, corona fatility, corona cases India

With a record 20,903 coronavirus cases reported in the past 24 hours, the total count in India has risen to 6,25,544. The death toll has gone up to 18,213 as Covid-19 claimed 379 lives in 24 hours. According to Health Ministry figures released today morning, 3,79,892 have recovered so far while there are 2,27,439 active cases in the country.

దేశంలో కరోనా విజృంభన: 24 గంటల్లో 20 వేల కేసులు.. ఇదే అత్యధికం..

Posted: 07/03/2020 02:22 PM IST
Coronavirus cases in india tally crosses 6 lakh nearly 17000 dead

(Image source from: Millenniumpost.in)

దేశంలో కరోనా మహమ్మారి మరణమృదంగాన్ని మ్రోగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఏ రోజుకారోజు కొత్తగా అత్యధిక కేసులను నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. తాజాగా గత రెండురోజుల నుంచి కొద్దిగా తక్కువ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత వారం రోజులుగా 19 వేల మార్కుకు పైబడిన కేసులు తాజాగా 20 వేలకు పైగా నమోదయ్యాయి. ఓ వైపు తన వ్యాప్తిని అంతకంతకూ పెంచుకుంటూ ఏకంగా ఐదు లక్షల ఎనభై వేల మార్కును దాటేసింది. అదే సమయంలో మరణాలను కూడా పెంచేస్తోంది. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది.

రోజురోజుకూ తనవ్యాప్తిని కూడా దేశ ప్రజలపై ఉదృతంగా కొనసాగిస్తోంది. ఫలితంగా కరోనా ప్రభావనపడిన దేశాల్లో నాల్గవ స్థానంలో భారత్ నిలిచింది. ఇక దేశంలో మరణాలు కూడా ఏకంగా 18 వేల మార్కును దాటేసాయి. దీంతో భారత్.. ప్రపంచంలో అత్యధిక మరణాలు సంభవించిన ఏడవ దేశంగా నమోదైంది. గత వారం రోజులుగా కరోనా కేసులు వ్యాప్తి ఉదృతంగా కోనసాగుతోంది. అన్ లాక్ 1.0 అమల్లోకి వచ్చిన జూన్ 7 నుంచి రోజుకు ఎనమిది వేలకు పైబడిన సంఖ్యలో కేసులు నమోదు కాగా, తాజాగా ఇవాళ 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక దేశంలో కరోనా ఉద్దృతి జులై మాసంలో అత్యఁధికంగా వుంటుందని సాక్ష్యాత్తు ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ప్రజలందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కూడా చెప్పారు. దీంతో దేశప్రజల్లో అందోళన మరింత తీవ్రమైంది.

దేశంలో క్రమంగా జడలువిప్పుతున్న కరోనా మహమ్మారి ఏకంగా ఆరు లక్షల మార్కును అధిగమించి పరుగులు పెడుతోంది. కరోనా పాజిటివ్ కేసులు ఉద్దృతి పెరుగుతున్న ఈ క్రమంలో కొంచెం కఠిన నిబంధనలు పెట్టాల్సిన కేంద్రం అన్ లాక్ 2.0 మార్గదర్శకాలలో రాకపోకలకు వెసలుబాటు కల్పించడం కూడా తీవ్రతను పెంచేందుకు కారణం అవుతుందన్న వాదనలు వినబడుతున్నాయి. గత ఐదు రోజులుగా దేశవ్యాప్తంగా ఏకంగా లక్షకుపైగా కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారిందో అర్థంచేసుకోవచ్చు. ఇక దీనికి తోడు మరణాలు కూడా మృదంగాన్ని మ్రోగిస్తున్నాయి. ప్రతీ రోజు మూడు వందలకు పైబడిన సంఖ్యలో నమోదైన మరణాలు.. గడిచిన 24 గంటల్లో ఏకంగా 507 మరణాలు నమోదయ్యాయి, దేశంలో అన్ లాక్ 2.0 నేటి (జులై 1) నుంచి అమల్లోకి రానుండడంతో రాకపోకలకు అనుమతులు లేకుండా చేసింది.

దీంతో పరిమిత సంఖ్యలోనే తిరిగిన వాహనాలు ఇకపై పూర్తిస్థాయిలో రోడ్డును ఎక్కనున్నాయి. మాల్స్, బార్లు, ధియేటర్లు, స్టేడియాల్లో ఆటలు ఇలా భారీ సంఖ్యలో జనసమూహం వున్న ప్రాంతాల్లో కార్యకలాపాలు మినహాయించి మిగిలిన అన్ని వ్యవహారాలకు అన్ లాక్ 1.0 తలుపులు తెరిచింది. దీంతో కరోనా కేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 20,903 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 6,25,544 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక కేసులు ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడులలోనే నమోదయ్యాయి, వీటితో పాటు ఉత్తర్ ప్రదేశ్, హర్యానాలలోనూ తాజాగా గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయి, వీటితో పాటు దేశంలో నిన్న ఏకంగా 379 మరణాలు నమోదయ్యాయి, దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య పద్దెనిమిది వేల మార్కును దాటాయి. తాజాగా నమోదైన మరణాల సంఖ్య ఏకంగా 18,213కు చేరింది.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. గడిచిన 24 గంటల వ్యవధిలో మహారాష్ట్ర ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో పలువురు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు 3,79,892 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 2,27,439 మంది మాత్రం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 60 శాతంగా నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  Maharashtra  Tamil Nadu  Delhi  Health Ministry  corona fatility  corona cases India  

Other Articles