Three New Symptoms Of COVID-19 కరోనా వైరస్ లక్షణాల జాబితాలో కొత్తగా చేరినవేంటీ.?

Covid 19 sixteen symptoms reported by sufferers

coronavirus, covid-19, coronavirus symptoms, stomach ache, abdomenal cramps, lockdown, symptoms of coronavirus, fever coronavirus, covid-19 india, Coronavirus treatment, Coronavirus symptoms, coronavirus cdc, cold fever, cdc

An urge to puke or feeling queasy can also be one of the symptoms of coronavirus. Experts also say that symptoms like nausea or constipation can be associated with cases of mild infection, who only experience gastrointestinal issues and fail to get the needed treatment early.

కరోనా వైరస్ లక్షణాల జాబితాలో కొత్తగా చేరినవేంటీ.?

Posted: 07/04/2020 11:02 PM IST
Covid 19 sixteen symptoms reported by sufferers

కొవిడ్-19ను ముందుగా గుర్తించడానికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాల మీద ఆధారపడితే సరిపోదని నిపుణులు అంటున్నారు. కరోనా బాధితుల్లో వెన్నునొప్పి, కడుపు నొప్పి, దద్దుర్లు, మోకాలి కింది భాగంలో నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. కొందరిలో డయేరియా సమస్య ఊహించినదానికంటే అధికంగా ఉందన్నారు. ‘ఒళ్లు నొప్పులు వంటి అసాధారణ లక్షణాలు బాధితుల్లో కనిపిస్తున్నాయి. కొంతమందికి కాలు కింది భాగంలో నొప్పి మినహా మరే లక్షణాలు ఉండటం లేదు’ అని కొవిడ్-19 ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందంలోని సభ్యుడైన డాక్టర్ శశాంక్ జోషి వెల్లడించారు.

నిర్ధారణ పరీక్షలకు ముందు 200 మంది కొవిడ్ అనుమానితులకు చికిత్స అందించిన సీనియర్ వైద్యులు జలీల్ పార్కర్ మాట్లాడుతూ..వారిలో చాలామంది వెన్నునొప్పితో బాధపడ్డారని వెల్లడించారు. తరవాత వారికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కొవిడ్ రోగులు వికారంతో బాధపడటడం సర్వసాధారణ సమస్యగా ఉందని టాస్క్‌ఫోర్స్‌లో మరో సభ్యుడు, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఓం శ్రీవాస్తవ అన్నారు. ‘ఒళ్లు నొప్పులతో పాటు కడుపులో నొప్పి, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు బాధితుల్లో కనిపిస్తున్నాయి. కొద్దిపాటి జ్వరం కూడా కొవిడ్‌ లక్షణంగా కనిపిస్తోంది’ అని గ్రాంట్ మెడికల్ కాలేజ్‌కి చెందిన ప్రొఫెసర్‌ డాక్టర్ హేమంత్ గుప్తా వెల్లడించారు.

షుగర్ లెవెల్స్ అదుపు తప్పడం కూడా  వైద్యులకు ఒక చిహ్నంగా భావిస్తున్నారు. వారికి అధిక మొత్తంలో ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన అవసరం వస్తోందని తెలిపారు. దద్దుర్లు, దురద వంటి లక్షణాలు యువతలో కనిపిస్తున్నట్లు వాక్‌హార్డ్ ఆసుపత్రులకు చెందిన వైద్యుడు ఒకరు తెలిపారు. కాగా, అమెరికన్ సెంటర్స్‌ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) ముక్కు కారడం, వికారం లేక వాంతులు, నీళ్ల విరేచనాలను  కొవిడ్ లక్షణాల జాబితాలో కొత్తగా చేర్చింది. ఇటీవల ఐసీఎంఆర్ కూడా రుచి, వాసనను కోల్పోవడం వంటి లక్షణాలను ఈ జాబితాలో చేర్చింది. జ్వరం, పొడిదగ్గు, అలసట సహజంగా కనిపించే లక్షణాలు కాగా..వీటికి అదనంగా కొత్తగా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles