Telangana's tally surges past 22000 mark with 1850 cases తెలంగాణలో 24 గంటల్లో 1850 కేసులు.. 8 మరణాలు

Covid 19 update with 1850 new covid 19 cases telanganas tally surges past 22000 mark

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

There is no stopping to the rise in the number of positive COVID-19 cases in Telangana. The state government has come under intense pressure from all corners for the lack of testing and mismanagement of the crisis in the state. 1850 fresh COVID-19 cases were reported in Telangana which saw the state's tall cross the 22000-mark.

తెలంగాణలో కరోనా విజృంభన: 24 గంటల్లో 1850 కేసులు.. 8 మరణాలు

Posted: 07/04/2020 11:36 PM IST
Covid 19 update with 1850 new covid 19 cases telanganas tally surges past 22000 mark

(Image source from: Timesofindia.indiatimes.com)

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ఇరవై రెండు వేల మార్కును దాటాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణవాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నమోదైన మరణాలతో తెలంగాణ.. ఏకంగా మరణాలలో 280 మార్కును చేరడం అందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకే దేశంలో వందకుపైగా మరణాలు నమోదు చేసుకున్న తొమ్మిదవ రాష్ట్రంగా నమోదైన తెలంగాణ.. ఇక ఇటు కరోనా కేసులలోనూ పైకి ఎగబాకుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా రాష్ట్రంలో రోజుకు రెండు వేలకు చేరువలో కేసులు నమోదు కావడం రాష్ట ప్రజలను అందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గినా.. మళ్లీ పెరుగుతున్న కేసులు, మరణాలు వారి పనితీరుకు సవాల్ విసిరేలా తయరావుతున్నాయి.

ఏప్రిల్ నెలలో గణనీయంగా తగ్గిన కేసులు మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా జూన్ నెలలో కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కు పలు సడలింపులు తీసుకురావడంతో జనజీవనం వేగాన్ని అందుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని నగరంలో కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి వున్నా.. అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలు కానీ జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభన కోనసాగుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూరా కరోనా మహమ్మారి మాటు వేయడం అందోళన రేపుతోంది. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం అగడం లేదు. ఇవాళ తాజాగా ఏకంగా రెండు వేల మార్కుకు చేరువలో తెలంగాణలో కరోనా కేసులు నమోదుకాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 1572 నమోదు కావడంలో నగరవాసుల్లోనూ అందోళన మరింత తీవ్రమైంది.

గత పక్షం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులతో కలిపి మొత్తంగా ఇరవై రెండు వేల మార్కును అధిగమించాయి, దీంతో 20 వేలకు పైగా కరోనా కేసుల నమోదు చేసుకున్న 9వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తాజాగా రాష్ట్రంలో 1850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇదివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 1572 కోరానా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, ఇవాళ గ్రేటర్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, వరంగల్ అర్భన్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ కరోనా కేసులు అధికసంఖ్యలో నమోదయ్యాయి.

అయితే గత వారం రోజులుగా నమోదవుతున్న కేసుల తెలంగాణవాసులను కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో పంజా విసురుతున్న కరోనా.. ఇక జిల్లాల్లోనూ తన ఉద్దృతిని చాటుకుంటోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులు మొత్తంగా 22000 మార్కును దాటిన విషయం తెలిసిందే, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులెవరికీ కరోనా పాజిటివ్ నిర్థారణ కాలేదని, అన్ని రాష్ట్రానికి చెందిన వారివేనని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి అసుపత్రులలో చికిత్సపోందుతూ ఐదు మంది అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 288కు చేరింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు కూడా పెరుగుతుండటం అందోళనకర పరిణమం.

తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 1850 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 22,312 కేసులు నమోదయ్యాయి, గ్రేటర్ పరిధిలో 1572 కేసులు నమోదు కాగా, ఇక రంగారెడ్డి జిల్లాలో 92, మేడ్చల్ జిల్లా పరిధిలో 53, వరంగల్ అర్భన్ జిల్లాలో 31 కేసులు. సంగారెడ్డిలో 8 కేసులు, నల్గోండ జిల్లాలో 10, మహబూబ్ నగర్ జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. గద్వాల జిల్లాలో 2, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3, ఖమ్మం జిల్లాలో ఏడు, నల్గొండ జిల్లాలో 10, సిద్దిపేట ఐదు, వరంగల్ రూరల్ జిల్లాలో ఆరు, జగిత్యాల జిల్లాలో ఐదు, నిర్మల్ లో ఒక్కటి, నిజామాబాద్ జిల్లాలో 17, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు, వికారబాద్ జిల్లాలో మూడు, భువనగిరి ఒక్కటి, జయశంకర్ భూపాలపల్లిలో నాలుగు, జనగాంలో మూడు, మెదక్ జిల్లాలో 1 కేసు పాజిటివ్ గా నిర్థారణ అయ్యాయి. కరోనా బారినపడిన బాధితులు కోలుకొని మొత్తంగా 11,537 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,487 యాక్టివ్‌ కేసులు వున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles