Secretariat new building design goes viral కొత్త సచివాలయం నమూనా విడుదల.. వేగంగా కూల్చివేత పనులు

Demolition of old telangana secretariat complex begins

telangana secretariat, secretariat hyderabad, secretariat telangana, hyderabad secretariat, telangana new secretariat, new secretariat telangana, outer ring road hyderabad, new secretariat, Telangana Secretariat new building, Secretariat new building design, Telangana Secretariat, TS new Secretariat building, Telangana new Secretariat building design

The demolition work of old secretariat building complex in Telangana's Hyderabad began in the early hours of Tuesday. The old secretariat, which has witnessed the rise and fall of various governments, has 10 blocks and is spread over 25.5 acres.

కొత్త సచివాలయం నమూనా విడుదల.. వేగంగా కూల్చివేత పనులు

Posted: 07/07/2020 07:30 PM IST
Demolition of old telangana secretariat complex begins

(Image source from: Twitter.com/baraju_SuperHit)

తెలంగాణ పాత సచివాలయాన్ని కూల్చేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి అనుమతులు లభించడంతో పాత సెక్రటేరియట్ భవన కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో నిన్న అర్థరాత్రి నుంచే పనులు ప్రారంభమయ్యాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేత పనులు ప్రారంభించింది ప్రభుత్వం. సచివాలయం వైపు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, మింట్ కాంపౌండ్, సెక్రటేరియట్ రహదారులను మూసివేసి వాహనాలను మళ్లించారు. ఏకంగా సెక్రటేరియట్ నుంచి కిలో మీటరు పరిధి వరకు పోలీసుల అంక్షలు కొనసాగుతున్నాయి.

ఇక కొత్త సచివాలయాన్ని నిర్మించాలని గత కొన్నేళ్లుగా భీష్మించిన ముఖ్యమంత్రి ఎట్టకేలకు తన పట్టు నెరవేర్చుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం అంటే గత ఏడాది జూన్ మాసం 17వ తేదీన సీఎం కేసీఆర్ నూతన సచివాలయ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఆ తరువాత ఈ విషయమై అనేక ప్రజాప్రయోజన వాజ్యాలు తెరపైకి వచ్చాయి. కేవలం సెక్రటేరియట్ వాస్తు బాగోలేదని సచివాలయాన్ని కూల్చివేయాలని మరో సెక్రటేరియట్ ను నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. పాత సచివాలయ చారిత్రకతకు ఆనవాలమని కూల్చివేత నేపథ్యంలో అది ఉనికిని కోల్పోతుందని పలు వ్యాజ్యాలు హైకోర్టును చేరాయి.

దీంట్లో భాగంగా ఇప్పటికే రెడీ అయిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ఫోటోను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సచివాలయం భవన నమూనాను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన నమూనా ఫొటోను సీఎం కార్యాలయం తాజాగా విడుదల చేసింది. దీనికి సీఎం కేసీఆర్ త్వరలోనే ఆమోద ముద్ర వేయనున్నారు. రాజప్రాసాదంలా ఠీవీగా కనిపిస్తున్న ఈ నమూనా ఆకట్టుకునేలా ఉంది. భవనం ముందున్న నీటి కొలనులో భవనం ప్రతిబింబిస్తూ ఠీవీగా రాజప్రసాదంలా వెలిగిపోతోంది. నూతన సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటున్నా కోర్టు కేసుల కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ప్రభుత్వం పట్టుపట్టి అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేసింది. దీంట్లో భాగంగా పాత భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కూల్చివేత పనులు కోనసాగుతున్నాయి. కూల్చివేతలో భాగంగా మొదట జీ, సి బ్లాక్ లను కూల్చివేస్తున్నారు. కూల్చివేత పనులను సీఎస్ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.  ఇక భవన శిథిలాలను తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయంలో రోడ్డువైపు ఉన్న భవనాలను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. అలాగే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాత్రి సమయాల్లోనే శిథిలాల తొలగింపు ప్రక్రియ కూడా చేపట్టనున్నారు. 15 నుంచి 20 రోజుల్లో కూల్చివేత ప్రక్రియ పూర్తి కానుంది.

నిజాంల కాలంలో నిర్మించిన కట్టడం చరిత్రలో కలిసిపోనుంది. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ భవనం నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సచివాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది. ఇక తాజాగా హైకోర్టు ఇచ్చిన అనుమతులతో ఏళ్ల నాటి చరిత్ర కనుమరుగు కానుంది. ఉమ్మడి తెలుగురాష్ట్రంలో చరిత్ర సృష్టించిన నందమూరి తారక రామారావు, ఆయనను గద్దెదింపిన చెన్నారెడ్డి, ప్రజాసంక్షేమ పాలనను అందించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు ఈ భవనం నుంచే పాలనను అందించారు. అంతకుముందు టి.అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్థన్ రెడ్డి సహా పలువురు దిగ్గజ రాజకీయ నేతలు ముఖ్యమంత్రులుగా ఈ సచివాలయం నుంచే పాలనను అందించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles