కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంపై తన ప్రభావాన్ని అత్యంత అధికస్థాయిలో చూపుతోంది. ఈ వైరస్ వెలుగులోనికి వచ్చి ఆరు మాసాలు కావస్తున్నా.. ఇంకా దీనికి మందును కనుగొనడంలో ప్రపంచ దేశాలు పోటీపడుతున్నాయి. ఇప్పటికీ విజయవంతమైన వాక్సీన్ కూడా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రాలేదు. నైజీరియా ఆఫ్రికాకు సంబంధించిన వాక్సీన్ ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కోంటున్నా.. దాని ఫలితాలపై ఇప్పటికీ ఇంకా ఎలాంటి చర్చా జరగడం లేదు. ఈ మహమ్మారి యావత్ ప్రపంచ గమనాన్ని,. ప్రగతిని స్థంభింపజేసింది. ప్రపంచాన్ని నిశ్చల స్థితికి తీసుకువచ్చింది. ప్రపంచ మానవాళి కనిపించని శత్రువుతో చేస్తున్న అతిపెద్ద పోరు ఇది. ఈ పోరులో ఇప్పటికే ఐదు లక్షల మంది వీరులయ్యారు.
ఇప్పటివరకు ప్రపంచంలో ఏ వైద్యుడు, శాస్త్రవేత్త, పరిశోధకుడు ఈ వ్యాధికి ఖచ్చితమైన కారణాన్ని ఎక్కడా, ఎవ్వరూ కనుగొనలేకపోయారు. అయితే ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. కోవిడ్ -19తో లింక్ ఉన్న డీఎన్ఏ.. 60వేల సంవత్సరాల క్రితం నియాండర్తల్స్ మానవులలో అధికంగా వుండిందని తాజా అధ్యయనం స్పష్టం చేసింది. కరోనా వైరస్ అధిక ప్రభావం చూపేది కూడా నియాండర్తల్ జీన్ వున్నవారిలోనే అత్యధికమని తాజా అద్యయనం తేల్చింది. ఈ జీన్ వున్నవారు ప్రమాదపుటంచునే వున్నట్లుగా పేర్కోంది. అయితే ఈ జీన్ ఎవరిలో అధికంగా వుందన్న సమాచారాన్ని కూడా ఇచ్చింది. బంగ్లాదేశీయులలో ఈ జీన్ ప్రభావం ఏకంగా 63శాతంగా వుందని చెప్పిన అధ్యయనం.. దాదాపుగా దక్షిణాసియాలోని ప్రజల్లో 30శాతం మేర వుందని.. అదే సమయంలో ఆఫ్రికా ఖండంలోని ప్రజల్లో అసలు ఈ జీన్ లేనే లేదని స్పష్టం చేసింది.
కోవిడ్ పై అధ్యయనం చేస్తున్న జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ ఇస్టిట్యూట్ ఫర్ ఎవల్యూషనరీ ఆంధ్రోపాలజీ శాస్త్రవేత్తలు బయో ఆర్ఎక్స్ 4 లో పోస్టు చేసిన ఓ పేపర్లో ఈ వివరాలను పొందుపర్చారు. ప్రస్తుతం కోవిడ్ ప్రభావానికి గురైన వారిని అది ఏ డిఎన్ఏపై అటాక్ చేసి.. ప్రమాదశాతాన్ని పెంచుతుందో అదే డీఎన్ఏ లో జీన్ నియాండర్తల్ లలో అధికంగా వుండిందని పేర్కోంది. నియాండర్తల్ మానవులు ఏకంగా 50 వేల సంవత్సరాల క్రితం క్రోట్యా ప్రాంతంలో వుండేదని వారు నలభై వేల ఏళ్ల క్రితం వరకు యూరాసియా ప్రాంతంలో వుండేవారని కూడా తెలిపారు. అయితే నియాండెర్తల్ తెగకు చెందిన మనుషులు ఆ తరువాత బతికివున్నారా.? అన్న విషయంలో స్పష్టం మాత్రం లేదని తెలిపారు.
అయితే ప్రస్తుతం దక్షిణాసియాలో దీని ప్రభావం అధికంగా ఎందుకుందీ.? అంటే ఇక్కడ ఇంకా నియాండర్తాల్ జీన్స్ వున్న మనుషులు వున్నారా.? అన్న విషయాన్ని కేవలం ఊహాజనితంగా మాత్రమే అంచానా వేస్తున్నామని హుగో జీబర్గ్ అనే శాస్త్రవేత్త సందేహాలను వ్యక్తం చేశారు. న్యూయార్క్ టైమ్స్‌తో అధ్యయనంలో పాల్గొనని ప్రిన్స్‌స్టన్ విశ్వవిద్యాలయంలోని జన్యు శాస్త్రవేత్త జాషువా అకీ మాట్లాడుతూ.. 60వేల ఏళ్ల క్రితం జరిగిన ఈ సంతానోత్పత్తి ప్రభావం నేటికీ ప్రభావం చూపుతోందని అన్నారు. అయితే ఈ జీన్ స్పాన్‌కు సంబంధించిన మానవ చరిత్ర అస్పష్టంగా ఉందని, నియాండెర్తల్ మానువుని క్రోమోజోమ్ 3లో ఆరు జన్యువులున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.
ప్రస్తుతం మానవులలో నియాండెర్తల్ జీన్ ఆఫ్రీకన్లలో అసలు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా బంగ్లాదేశీయులలో 63 శాతం మంది ప్రజలు కనీసం ఈ జన్యువుకు సంబంధించిన ఒక కాపీని కలిగి ఉన్నట్లుగా అధ్యయనం చెప్పింది. ఇక యూరోపియన్లలో ఎనమిది శాతం మంది నియాండర్తెల్ జీన్ ను కలిగివున్నారని, అదే సమయంలో అన్ని తెగలకు సంబంధించిన మానవులతో కూడిన అమెరికాలోనూ నాలుగు శాతం మందిలో నియాండెర్తల్ జన్యువు వున్నట్లు చెప్పారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల విషయానికొస్తే, మానవులలో ఈ జన్యువు అంతగా లేదని గుర్తించింది. ఇక మహిళలతో పోలిస్తే వృద్ధులకు ఎందుకు ఎక్కువ ముప్పు, లేదా పురుషులకు ఎందుకు ఎక్కువ ప్రమాదం అనే విషయాలపై వారు పరిశోధనలు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more