PIL against demolition of old Secretariat పాత సచివాలయం భవనం కూల్చివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్

Pil against demolition of old telangana secretariat complex

telangana secretariat, secretariat hyderabad, secretariat telangana, hyderabad secretariat, telangana new secretariat, new secretariat telangana, outer ring road hyderabad, new secretariat, Telangana Secretariat new building, Secretariat new building design, Telangana Secretariat, TS new Secretariat building, Telangana new Secretariat building design

Public Interest Litigation petition was filed today in Telangana High Court againt the demolition work of old secretariat building complex, which has witnessed the rise and fall of various governments, has 10 blocks and is spread over 25.5 acres.

పాత సచివాలయం భవనం కూల్చివేతకు వ్యతిరేకంగా హైకోర్టులో పిల్

Posted: 07/08/2020 07:49 PM IST
Pil against demolition of old telangana secretariat complex

తెలంగాణ పాత సచివాలయాన్ని కూల్చేందుకు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి అనుమతులు లభించడంతో పాత సెక్రటేరియట్ భవన కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం అర్థరాత్రి నుంచే కూల్చివేత పనులు ప్రారంభించింది ప్రభుత్వం. సచివాలయం వైపు వెళ్లే అన్ని మార్గాలను మూసివేసి వాహనాలను మళ్లించారు. ఏకంగా సెక్రటేరియట్ నుంచి కిలో మీటరు పరిధి వరకు పోలీసుల అంక్షలు కొనసాగుతున్నాయి. కాగా ఈ తరుణంలో మరోమారు పాత సచివాలయ భవన నిర్మాణాన్ని కూల్చేవేయడంపై మరోమారు హైకోర్టులో ప్రజాప్రయోజనవాజ్యం దాఖలైంది.

ఇక కొత్త సచివాలయాన్ని నిర్మించాలని గత కొన్నేళ్లుగా తలచిన ముఖ్యమంత్రి ఎట్టకేలకు తన పట్టు నెరవేర్చుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం అంటే గత ఏడాది జూన్ మాసం 17వ తేదీన సీఎం కేసీఆర్ నూతన సచివాలయ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఆ తరువాత ఈ విషయమై అనేక ప్రజాప్రయోజన వాజ్యాలు తెరపైకి వచ్చాయి. కేవలం సెక్రటేరియట్ వాస్తు బాగోలేదని సచివాలయాన్ని కూల్చివేయాలని మరో సెక్రటేరియట్ ను నిర్మించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని.. పాత సచివాలయ చారిత్రకతకు ఆనవాలమని కూల్చివేత నేపథ్యంలో అది ఉనికిని కోల్పోతుందని పలు వ్యాజ్యాలు హైకోర్టును చేరాయి.

వాటన్నింటినీ పరిశీలించిన తరువాత ఏకంగా ఏడాది కాలంపైన విచారించిన న్యాయస్థానం హైకోర్టు కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. అయితే, ఆ‌ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని ఈ రోజు హైకోర్టులో మరో ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యం దాఖ‌లైంది. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని  ప్రొఫెసర్ పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. దీని వ‌ల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి,  ఆ ప్రాంతంలో దాదాపు ల‌క్ష‌ల మంది పీల్చే స్వ‌చ్ఛ‌మైన గాలి కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా భవనాలను కూల్చివేస్తున్నారని చెప్పారు.

అయితే, ఈ పిల్‌ను అత్య‌వ‌స‌రంగా విచారించ‌లేమ‌ని హైకోర్టు తెలిపింది. నిజాంల కాలంలో నిర్మించిన కట్టడం చరిత్రలో కలిసిపోనుంది. 132 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ భవనం నిజాం నవాబుల పాలనా కేంద్రంగా సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ సచివాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రుల పాలనా కేంద్రంగా ఉంది. ఇక తాజాగా హైకోర్టు ఇచ్చిన అనుమతులతో ఏళ్ల నాటి చరిత్ర కనుమరుగు కానుంది. ఉమ్మడి తెలుగురాష్ట్రంలో చరిత్ర సృష్టించిన నందమూరి తారక రామారావు, ఆయనను గద్దెదింపిన చెన్నారెడ్డి, ప్రజాసంక్షేమ పాలనను అందించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డిలు ఈ భవనం నుంచే పాలనను అందించారు. అంతకుముందు టి.అంజయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నెదురుమల్లి జనార్థన్ రెడ్డి సహా పలువురు దిగ్గజ రాజకీయ నేతలు ముఖ్యమంత్రులుగా ఈ సచివాలయం నుంచే పాలనను అందించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles