తెలంగాణకు కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది జూన్ 17న శంఖుస్థాపన చేసిన నాటి నుంచి అడ్డంకులు ఏర్పడుతునే వున్నాయి. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి అనుమతులు లభించడంతో పాత సెక్రటేరియట్ భవన కూల్చివేత పనులు యుద్ద ప్రాతిపదికన కొనసాగుతున్న ఈ తరుణంలో హైకోర్టు కూల్చివేతలను నిలిపివేయాలని స్టే విధించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరోమారు అడ్డంకులు ఏర్పడ్డాయి. రాష్ట్రోన్నత న్యాయస్థానం తెలంగాణ పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులను మరో రెండు రోజుల పాటు నిలిపివేయాలని తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సోమవారం వరకు మాత్రమే నిలవాల్సిన కూల్చివేత పనులు మరోమారు బుధవారం వరకు పోడుగించింది.
దీనిపై గతంలో విచారణ ధర్మాసనం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఇవాల్టి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించింది. తిరిగి దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం కూల్చివేతపై జూన్ 30న ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఏజీ హైకోర్టుకు వివరించారు. మంత్రివర్గ ప్రతిని సమర్పించకుంటే ఎలా విచారణ చేపట్టాలని హైకోర్టు ప్రశ్నించింది. మంత్రివర్గ నిర్ణయంపై కనీసం ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదని వ్యాఖ్యానించింది. మంత్రివర్గ నిర్ణయ ప్రతిని సాయంత్రం లోపు సమర్పిస్తామని కోర్టు ఏజీ తెలిపారు. మంత్రివర్గ నిర్ణయాన్ని షీల్డు కవరులో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వకౌంటర్ పై అభ్యంతరాలుంటే రేపటిలోగా సమర్పించాలని పిటిషనర్లను కోరింది. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.
పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు నిలిపి వేయాలని హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే. కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ భవనాలను కూల్చివేస్తున్నారని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీని వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడి, ఆ ప్రాంతంలో దాదాపు లక్షల మంది పీల్చే స్వచ్ఛమైన గాలి కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిబంధనలను పట్టించుకోకుండా భవనాలను కూల్చివేస్తున్నారని చెప్పారు. ఈ పిటీషన్ పై ఇవాళ విచారించిన న్యాయస్థానం తొలుత సోమవారం వరకు ఆ తరువాత బుధవారం వరకు తాత్కలికంగా కూల్చివేత పనులు నిలిపివేయాలని అదేశాలు జారీ చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more