విశాఖపట్న వాసులను వరుసగా ప్రమాదాలు పలకరిస్తున్నాయి. ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో సంభవించిన ప్రమాదంతో నెలకోన్న విషాద ఛాయలనే ఇంకా విశాఖవాసులు మర్చిపోలేకపోతున్నారు, ఈ తరుణంలో మరో గ్యాస్ లీక్, ఆ తరువాత ఇప్పుడు తాజాగా మరో అగ్ని ప్రమాదం విశాఖ వాసులను భయాందోళనకు గురిచేస్తోంది, పరవాడలోని జవహరలాల్ నెహ్రూ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాంకీ ఎస్ఈటీపీ సాల్వెంట్ ఫార్మాకంపెనీలో భారీపేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల కారణంగా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. దీంతో స్థానికులు, సంస్థ సిబ్బంది భయాందోళనలు చెందుతున్నారు.
రాంకీ సాల్వెంట్ కంపెనీలో రియాక్టర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు, సిబ్బంది భయాందోళనలతో పరుగులు తీశారు. పలుమార్లు పేలుళ్లు సంభవిస్తుండటంతో అగ్నిమాపక సిబ్బంది సమీపంలోకి వెళ్లలేకపోతున్నారు. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి దూరంగా నిలిచిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. పేలుడు శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయి. సమీపంలోని కంపెనీలకు మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని పరిసర కంపెనీల సిబ్బంది, స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
పేలుళ్ల కారణంగా ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. ప్రతి రోజు మాదిరిగానే రాత్రి పది గంటలకు నైట్ షిఫ్ట్ మొదలైన కొద్దిసేపట్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇటీవల రసాయన వాయువులు లీకై ఇద్దరు మృతి చెందిన సాయినాథ్ లైఫ్ సైన్సెస్ కంపెనీకి సమీపంలోనే ఈ పరిశ్రమ ఉండటం గమనార్హం. పరవాడ ఫార్మాసిటీలోని వేరువేరు కంపెనీలో మందులు తయారు చేసే క్రమంలో వచ్చే ఒక రకమైన వృథా ఆయిల్ ను తిరిగి శుభ్రం పరిచే ప్రక్రియ ఈ కంపెనీలో జరుగుతుంది. కాగా ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది గాయపడినట్లు సమాచారం. గాయపడిని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more