Telangana's tally surges past 37000 mark with 1524 cases తెలంగాణలో 37 వేల మార్కు ధాటిన కరోనా కేసులు..

Covid 19 update with 1524 new covid 19 cases telanganas tally surges past 37000 mark

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

There is no stopping to the rise in the number of positive COVID-19 cases in Telangana. The state government has come under intense pressure from all corners for the lack of testing and mismanagement of the crisis in the state. 1524 fresh COVID-19 cases were reported in Telangana which saw the state's tall cross the 37000-mark.

తెలంగాణలో కరోనా విజృంభన: ముఫై ఏడు వేల మార్కు ధాటిన కేసులు.. 375 మరణాలు

Posted: 07/15/2020 11:48 AM IST
Covid 19 update with 1524 new covid 19 cases telanganas tally surges past 37000 mark

(Image source from: Hindustantimes.com)

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు ముఫై ఆరు వేల మార్కును దాటాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణ వాసులను ఎంతో కలవరానికి గురిచేస్తున్న మరణాలు.. ప్రతీ రోజు రాష్ట్రంలో సంభవిస్తుండడం అందోళన కలిగిస్తోంది. తాజాగా నమోదైన మరణాలతో తెలంగాణ.. ఏకంగా మరణాలలో 370 మార్కును చేరడం అందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకే దేశంలో వందకుపైగా మరణాలు నమోదు చేసుకున్న తొమ్మిదవ రాష్ట్రంగా నమోదైన తెలంగాణ.. ఇక ఇటు కరోనా కేసులలోనూ పైకి ఎగబాకుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ఏకంగా రాష్ట్రంలో రోజుకు వేయ్యి మేర కేసులు నమోదు కావడం రాష్ట ప్రజలను అందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గినా.. మళ్లీ పెరుగుతున్న కేసులు, మరణాలు వారి పనితీరుకు సవాల్ విసిరేలా తయారవుతున్నాయి.

ఏప్రిల్ నెలలో గణనీయంగా తగ్గిన కేసులు మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా జూన్ నెలలో కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కు పలు సడలింపులు తీసుకురావడంతో జనజీవనం వేగాన్ని అందుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని నగరంలో కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి వున్నా.. అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలు కానీ జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభన కోనసాగుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూరా కరోనా మహమ్మారి మాటు వేయడం అందోళన రేపుతోంది. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం అగడం లేదు. ఇవాళ తాజాగా నమోదైన కేసులలోనూ అత్యధిక కేసులు గ్రేటర్ కు పరిధిలోనివే కావడం గమనార్హం.

గత పక్షం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఫలితంగా తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులతో కలిపి మొత్తంగా ముఫై ఏడు వేల మార్కును అధిగమించాయి, దీంతో దేశంలో అత్యధికంగా కరోనా కేసుల నమోదు చేసుకున్న 9వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తాజాగా రాష్ట్రంలో 1524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇదివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 815 కోరానా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, ఇవాళ గ్రేటర్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, సంగారెడ్డి జిల్లాల్లోనూ కరోనా కేసులు అధికసంఖ్యలో నమోదయ్యాయి.

అయితే గత వారం రోజులుగా నమోదవుతున్న కేసుల కన్నా అధికసంఖ్యలో హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులు మొత్తంగా 37000 మార్కును దాటిన విషయం తెలిసిందే, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులెవరికీ కరోనా పాజిటివ్ నిర్థారణ కాలేదని, అన్ని రాష్ట్రానికి చెందిన వారివేనని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో ఇద్దరు కరోనా బారిన పడి అసుపత్రులలో చికిత్సపోందుతూ పది మంది అసువుల బాసారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 375కు చేరింది. గత వారం రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు కూడా పెరుగుతుండటం అందోళనకర పరిణమం.

తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 1524 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 37,745 కేసులు నమోదయ్యాయి, గ్రేటర్ పరిధిలో 815 కేసులు నమోదు కాగా, ఇక రంగారెడ్డి జిల్లాలో 240, మేడ్చల్ జిల్లా పరిధిలో 97, సంగారెడ్డి పరిధిలో 61 కేసులు పాజిటివ్ గా నిర్థారణ అయ్యాయి. ఇక ఖమ్మం 8, కామారెడ్డి జిల్లాలో 19, వరంగల్ అర్బన్ 30, వరంగల్ రూరల్ 2, నిర్మల్ లో 3, కరీంనగర్ జిల్లాలో 29, జగిత్యాలలో 2, మెదక్ లో 24, మహబూబ్ నగర్ జిల్లాలో 7, మంచిర్యాలలో 12, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8, జయశంకర్ భూపాలపల్లిలో 12, నల్గోండ జిల్లాలో 38, రాజన్న సిరిసిల్లలో 19, అదిలాబాద్ జిల్లాలో 7, ఆసిఫాబాద్ లో 5, వికారాబాద్ లో 21, నగర్ కర్నూల్ లో 1, జనగాంలో 4, నిజామాబాద్ లో 17, ములుగు లో 6, వనపర్తిలో 5, సిద్దిపేటలో 4, సూర్యాపేటలో 15, గద్వాల జిల్లాలో 13 కేసులు నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య కూడా 375కి చేరింది. కరోనా బారినపడిన బాధితులు కోలుకొని మొత్తంగా 24840 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,531యాక్టివ్‌ కేసులు వున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles