ప్రకృతిలో ఎన్నో అరుదైన జంతువులు, పక్షులు, పూల మొక్కలు, కీటకాలు ఉంటాయి. రూపంలో కొన్ని అందంగా ఉంటే.. మరికొన్ని భయానకంగా ఉంటాయి. పక్షి జాతిలో ఎన్నో రకాల పక్షలు మనం చూస్తుంటాం.. అప్పుడప్పుడు మన కంటికి కనిపించని అరుదైన పక్షులు కూడా తారసపడుతుంటాయి. ఇక సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఈ తరహా అందాలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా తెలంగాణలోని కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో అరుదైన విహాంగం దర్శనమిచ్చింది. ఇధి గద్ద జాతికి చెందిన రూఫస్ బెల్లీడ్ అనే అరుదైన పక్షిగా గుర్తించారు.
దీనికి పొడవైన రెక్కలు, తోకతో ఆకర్షించేలా ఉన్న ఈ పక్షి జిల్లాలోని పెంచికల్‌పేట మండలం నందిగాం అటవీ ప్రాంతంలోని పాలరాపుగుట్ట ప్రాంతంలో కనిపించింది. ఈ అరుదైన పక్షిని వీక్షించగానే స్థానిక అటవీ అధికారులు వెంటనే దానిని కెమెరాల్లో బంధించారు. తెలంగాణ ప్రాంతానికి ఈ పక్షి వలస రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. సాధారణంగా ఎక్కువ పచ్చదనం వున్న ప్రాంతాల్లోనే ఈ జాతి పక్షలు వుంటాయి. అటు కేరళ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని నల్లమల అడవుల్లో ఆవాసం ఏర్పర్చుకునే ఈ విహాంగం ఏకంగా తెలంగాణకు రావడం ఇక్కడి పచ్చని సంపద వృద్ది చెందిందని చెప్పేందుకు సంకేతంగా పరిగణిస్తున్నారు అధికారులు.
అంతేకాదు ఈ తరహా పక్షులు చాలా అరుదుగా ఉంటాయని.. తెలంగాణ ప్రాంతానికి ఈ పక్షి వలస రావడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. ఈ పక్షులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లితోపాటు అసోం, పశ్చిమ కనుమలలో కనిపిస్తుంటాయని పెంచికల్‌పేట అటవీ రేంజ్ అధికారి వేణుగోపాల్ తెలిపారు. ఈ రూఫస్ బెల్లీడ్ పక్షి పిల్ల అని.. రూపస్ బెల్లీడ్ అడల్ట్ పక్షుల్లో రెక్కలు మరింత దట్టంగా వుంటాయని చెప్పారు. ఈ పక్షులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లితోపాటు అసోం, పశ్చిమ కనుమలలో కనిపిస్తుంటాయని తెలిపారు. కాగా.. సంతానాన్ని అభివృద్ధి చేసుకోవటానికి..ఆహారం సమృద్ధిగా ఉండటం కోసం..వాతావరణ అననుకూలత నుంచి తప్పించుకోవడం కోసం పక్షలు వలసలు వెళ్లటం సర్వసాధారణం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more