Woman constable seeks to resign after transfer ఉద్యోగానికి రాజీనామా.. ఐపీఎస్ గా తిరిగోస్తా: సునితా యాదవ్

Gujarat constable sunita yadav who tutored law to ministers son eyes ips rank

Gujarat, police Constable Sunita Yadav, surat, bjp mla, Gujarat woman constable, Sunita Yadav, gujarat health minister, Kumar Kanani, Prakash Kanani, politics

Sunita Yadav said posted a video on social media saying she was 'under pressure', receiving 'abuses' and 'threats for her life'. She was given protection by the police, and also transferred out of the police station under which the incident took place. She later tendered her resignation.

ఉద్యోగానికి రాజీనామా.. ఐపీఎస్ గా తిరిగోస్తా: సునితా యాదవ్

Posted: 07/15/2020 11:17 PM IST
Gujarat constable sunita yadav who tutored law to ministers son eyes ips rank

మంత్రి కుమారుడికి ఝలక్ ఇవ్వడంతో పాటు తనపై ట్రాన్స్ ఫర్ వేటు వేయడంతో మనస్తాపానికి గురైన గుజరాత్ మహిళా కానిస్టేబుల్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారారు. అమెను లేడి సింగమ్ అంటూ నెటిజనులు కీర్తస్తున్నారు. ఉన్నతోన్నతమైన పదవుల్లో వుండి కూడా బ్యూరోకాట్లు చేయలేని పనిని ఓ మహిళా కానిస్టేబుల్ చేసి చూపారని ప్రశంసిస్తున్నారు. అయితే తాజాగా అమె తన పై బదిలీ వేటు వేయడంతో మనస్తాపానికి గురైన అమె.. తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించారు. అయితే పోలీసు కానిస్టేబుల్ కావడంతోనే తనపై ఇలా వేటు వేశారని, దీంతో మంత్రి వర్గీయుల నుంచి బెదిరింపులు కూడా వస్తున్నాయని అన్నారు.

అయితే ఈ ఘటన తనలో తన హోదాను పెంచుకునేందుకు దోహదపడుతుందని, తాను కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి.. త్వరలో సివిల్స్ పరీక్షలను రాస్తానని ప్రతీన బూనారు. ఇక త్వరలోనే తాను ఐపీఎస్ అధికారిగా వస్తానని కూడా భీష్మించారు. ఈసారి ఐపీఎస్‌గా అడుగుపెడతానని శపథం పూనారు. ఇప్పటివరకు మీడియాలో వచ్చింది కేవలం 10 శాతం మాత్రమేనని.. తన వద్ద ఇంకా 90 శాతం విషయాలు ఉన్నాయని సునీతా యాదవ్ పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదించిన అనంతరం అన్ని విషయాలను ప్రజల ముందు పెడతానని చెప్పారు. తదనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

‘ఈ యుద్ధంలో నేను మరణించినా నాకు ఎలాంటి విచారం ఉండదు. నా తోటి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారుల నుంచి నాకు మద్దతు ఉన్నది’ అని సునీతా యాదవ్ పేర్కొన్నారు. ‘నా పోరాటం సునీతా యాదవ్ కోసం కాదు, ఖాకీ యూనిఫాం కోసం. ఖాకీ యూనిఫాంలోనే అబద్ధం ఉందని ఇంతకుముందు అనుకునేదాణ్ని. కానీ, అది ఉద్యోగ ర్యాంక్‌లో ఉందని ఈ ఘటన నిరూపించింది. సరైన ర్యాంక్ లేకపోవడం వల్ల నన్ను ఇప్పుడు బబుల్‌గమ్‌లా నమిలేస్తున్నారు. అందుకే ఐపీఎస్‌కు ప్రిపేర్ కావాలనుకుంటున్నాను. నాకు బెదిరింపులు వస్తున్నాయి. ఈ యుద్ధంలో నేను మరణించినా నాకు విచారం లేదు’
అని సునీతా యాదవ్ అన్నారు.

మంత్రి అనుచరుల నుంచి తనకు ముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని కోరడంతో తనకు రక్షణ కల్పించారని కూడా చెప్పారు. నాకు ఫోన్‌లో కొన్ని బెదిరింపులు వచ్చాయి. మీరు దేశం కోసం చాలా చేస్తున్నారు.. ఎక్కువ కాలం జీవిస్తారని అనుకోవడం లేదు అంటూ హెచ్చరికలు కూడా వచ్చాయని అన్నారు రు. అలాంటి వారికి తగిన పాఠం చెబుతా’ అని సునీతా యాదవ్ అన్నారు. ఇక సమస్యను పరిష్కరించుకుంటే రూ.50 లక్షలు ఇస్తామని తనకు రాయబారం కూడా పంపారని సునీతా యాదవ్ చెప్పారు. మూడు రోజుల కిందటే కాల్ వచ్చిందని తెలిపారు. సూరత్ పోలీసు కమిషనర్ ను కలిసి పోలీసు రక్షణ కోరినట్లు వెల్లడించారు. ఆ ఫోన్ కాల్ గుజరాత్ రాష్ట్రం బయటి నుంచి వచ్చినట్లుగా కనిపిస్తోందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles