Rs 5 Cr Seized From A Car In Chennai కారులో సరిహద్దులు దాటిన రూ. 5కోట్లు.. రాజకీయ దుమారం..

Political sensation as rs 5 cr seized from a car in chennai three ap persons held

Rs 5 cr seized, Chennai seize, crore seized in car, Chennai car incident, Rs 5 cr seized in Chennai, Balineni Srinivas Reddy, Rs 5 cr seized in Chennai news, Rs 5 cr seized in Chennai breaking, Rs 5 cr seized in Chennai video, Rs 5 cr seized in Chennai latest, Rs 5 cr seized in Chennai new updates

The Chennai cops seized cash worth Rs 5 crores in the denominations of Rs 500 from a car near the outskirts of Chennai yesterday. The incident took place at Elavur checkpost in Arambakkam near Gummidipoondi. The car had Coimbatore registration number (TN 66E 1166).

కారులో సరిహద్దులు దాటిన రూ. 5కోట్లు.. రాజకీయ దుమారం..

Posted: 07/16/2020 03:13 PM IST
Political sensation as rs 5 cr seized from a car in chennai three ap persons held

రాష్ట్రానికి అందులోనూ ఒంగోలుకు చెందిన ముగ్గురు వ్యక్తులు స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే స్టిక్కర్ తో దర్జాగా కారులో అక్రమంగా ఐదు కోట్ల రూపాయలను తరలించారు. వీళ్లు ఎన్నాళ్లుగా ఇలా చేస్తున్నారో.. ఇప్పటికే ఇలా ఎన్ని కోట్ల రూపాయలు సరిహద్దులు దాటించారో తెలియదు కానీ ఇవాళ తమిళనాడులోని గుమ్మిడిపూండి సమీపంలో పట్టుబడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. పట్టుబడ్డ సమయంలో నిందితుల వద్ద ఏకంగా నాలుగు బ్యాగుల్లో రూ.5.27 కోట్ల కరెన్సీ నోట్లు వున్నాయి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో అక్రమంగా డబ్బును తరలిస్తున్న కేసులో కారులో ఒంగోలుకు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌ నుంచి చెన్నైకి కొందరు గంజాయి రవాణా చేస్తున్నారని ఆరంబాక్కం పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు ఇవాళ వేకువజామున ఎలావూరులోని చెక్ పోస్టు దగ్గర వాహన తనిఖీలు చేపట్టారు. ఆ వైపుగా వచ్చిన ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారును ఆపి తనిఖీ చేశారు. వెనుక సీట్లో నాలుగు సంచుల్లో ఉన్న రూ.5.27 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ఒంగోలుకు చెందిన నాగరాజ్‌, వసంత్‌, కారు డ్రైవరు సత్యనారాయణన్ లను అరెస్టు చేశారు. నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది. కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. దాని రిజిస్ట్రేషను నంబరు టీఎన్‌ 66ఈ 1166 అని ఉంది. కారు కోయంబత్తూరు సెంట్రల్‌ ఆర్టీవో పరిధిలోని వి.రామచంద్రన్‌ పేరిట ఉన్నట్లు సమాచారం.

ఘటనపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరణ

 

తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన కారులో రూ. 5 కోట్లు వ్యవహారంలో తన పేరు ప్రస్తావనకు రావడంతో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఆ కారుపై తన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండటంతో బాలినేని స్పందిస్తూ, ఓ వీడియోను విడుదల చేశారు. ఈ కారుకు, పార్టీకి సంబంధం లేదన్నారు. ఈ విషయం విచారణలో తెలుస్తుందని తెలిపారు.  తనకు తెలిసినంత వరకూ కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదని, జిరాక్స్ కాపీ అని వ్యాఖ్యానించారు. ఆ వాహనం తమిళనాడులో రిజిస్టర్ అయిందని గుర్తు చేసిన ఆయన, స్టిక్కర్ ఫోటోస్టాట్ కాపీ అని, దీన్ని మీడియా వారు పరిశీలిస్తే, వారే గుర్తించగలరని అన్నారు. ఈ డబ్బు తనకు సంబంధించినది మాత్రం కాదని, అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. తప్పు ఎవరిదైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.

సరిహద్దులు తరలివెళ్తున్న అక్రమ సంపాదన: నారా లోకేష్

 

పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న మద్యాన్ని పట్టుకుంటూ, గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కారుకు, ఇక్కడి నుంచి పోతున్న డబ్బులను మాత్రం పట్టుకునే దమ్ము లేకపోయిందని టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. వైసీపీ నేత బాలినేని స్టిక్కర్ తో ఉన్న కారులో డబ్బు పట్టుబడటాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్లు పెట్టారు. "వైఎస్ జగన్ గారి సాండ్, ల్యాండ్, వైన్ తమిళనాడులో దొరికిపోయింది. మంత్రి అనుచరులు, మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో 5.27 కోట్లు తరలిస్తూ పట్టుబడ్డారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న డబ్బుల కట్టలు చూస్తే వైకాపా ఎమ్మెల్యేల దోపిడీ ఏ రేంజ్ లో ఉందో అర్థం అవుతుంది" అని అన్నారు. ఆ తరువాత "ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న మద్యాన్ని పట్టుకొని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వానికి పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న అక్రమ సొమ్ముని పట్టుకునే దమ్ముందా?" అని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles