తెలంగాణకు కొత్త సచివాలయ భవనాన్ని నిర్మించాలని తలపెట్టిన కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాది జూన్ 17న శంఖుస్థాపన చేసిన నాటి నుంచి ఏర్పడుతున్న అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు నుంచి అనుమతులు లభించడంతో పాత సెక్రటేరియట్ భవన కూల్చివేత పనులు యుద్ద ప్రాతిపదికన చేపట్టిన తరుణంలోనూ హైకోర్టులో పిల్ దాఖలు కావడంతో కూల్చివేతలను నిలిపివేయాలని రాష్ట్రోన్నత న్యాయస్థానం స్టే విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇవాళ ఈ పిల్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పాత సచివాలయ కూల్చివేతల పనులకు అనుమతులను మంజూరు చేసింది. దీంతో గత పది రోజులుగా సచివాలయం కూల్చివేతల పనులపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.
సెక్రటేరియెట్ కూల్చివేత పనులు నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పి.ఎల్.విశ్వేశ్వరరావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు సుదాకర్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గత వారం రోజులుగా సుదీర్ఘంగా విచారించిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు, సుధాకర్ ల పిటీషన్లను న్యాయస్థానం కొట్టివేసింది. కాగా, సచివాలయం కూల్చివేతకు ముందస్తు పర్యావరణ అనుమతి తీసుకోలేదని గతంలో విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
అయితే కూల్చివేత సమయంలో పర్యావరణ అనుమతి అవసరం లేదని రాష్ట్రప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు, అయితే కూల్చివేతలకు జీహెచ్‌ఎంసీ అనుమతి తీసుకున్నామని తెలిపారు. నిర్మాణానికి భూమిని సిద్ధం చేసేందుకు పర్యావరణ అనుమతి అవసరమని, కూల్చివేతలు.. నిర్మాణానికి భూమిని సిద్ధం చేయడానికేనని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై కేంద్ర పర్యవరణ మంత్రిత్వ శాఖను వివరణ కోరింది. తాజాగా కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్రం చెప్పడంతో పిటిషన్ ను రద్దు చేస్తూ.. సచివాలయ నిర్మాణాల కూల్చివేతకు హైకోర్టు మార్గం సుగమం చేసింది.
తెలంగాణ సచివాలయం కూల్చివేతకు సంబంధించి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దేశసర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం కొట్టివేసింది. తెలంగాణ సచివాలయం భవనాలు కూల్చివేతకు హైకోర్టు జూన్ 29న అనుమతిచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ జీవన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం.. సచివాలయం కూల్చివేతకు సంబంధించి తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. హైకోర్టు నిర్ణయంలో తాము జోక్యం చేసుకోబోమని తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more