మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక ముందడుగు పడింది. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ విచారణ ఇవాళ ప్రారంభించింది. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు విచారణ మొదలుపెట్టారు. కడప ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ అన్బురాజన్ తో ఏడుగురు అధికారులు సమావేశమయ్యారు. ఆ తరువాత కడప ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో సీబిఐ అధికారులు కేసును విచారణను ప్రారంభించారు. 2019 మార్చి 15న జరిగిన వివేకా హత్యపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం పులివెందులకు వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టనున్నారు.
వివేకా హత్య కేసును సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టి ధర్మాసనం నాలుగు నెలల ముందే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. హత్య జరిగి ఏడాది గడుస్తున్నా ‘మిస్టరీ’ ఇంకా వీడలేదని అప్పట్లో వ్యాఖ్యానించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)/రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఇప్పటికే ఈ కేసుపై మూడు సార్లు విచారణ చేపట్టారు. దాదాపు 1300 మంది అనుమానితులను విచారించారు. అయినప్పటికీ హంతకులను గుర్తించలేదని హైకోర్టు ఆక్షేపించింది. కేసుపై విచారణ చేపట్టాలని సీబీఐని ఆదేశించింది.
హత్యకు రాజకీయ కారణాలా?, భూమి, ఆస్తి తగాదాలా అనే విషయాలను సిట్ తేల్చలేకపోయిందని చెబుతూ..హత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాల వ్యక్తుల జోక్యం ఉండొచ్చనే సందేహం హైకోర్టు వెలిబుచ్చింది. ఇలాంటి కేసుల దర్యాప్తులో సమయం చాలా కీలకమైందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకొని ఈకేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు ముగించి, ‘తుది నివేదిక’ను దాఖలు చేయాలని సీబీఐకి సూచించింది. ఈ కేసుకు చెందిన అన్ని రికార్డులను సీబీఐకి అప్పగించాలని సిట్‌ను ఆదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more