ప్రపంచవ్యాప్తంగా కరాళనృత్యం చేస్తున్న కరోనా మహమ్మారి ఇటు తెలంగాణలోనూ తన ఉద్దృతిని రోజురోజుకూ విపరీతంగా చాటుతుంది. తెలంగాణలోకి కరోనా మహమ్మారిని రానివ్వమని ప్రభుత్వాలు ఎన్ని ప్రకటనలు చేసినా.. ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా.. దాని విలయతాండవం ముందు నిలువ లేకపోయాయన్నది సత్యం. ప్రపంచాన్నే కుదిపేస్తున్న ఈ మహమ్మారి తెలంగాణలోనూ పంజా విసురడం పెద్ద చర్చనీయాంశం కాకపోయినా.. ఇక్కడి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు.. ప్రభుత్వ అసుపత్రులు, ప్రైవేటు, కార్పోరేట్ అసుపత్రులపై నియంత్రణ కోల్పోయినట్టుగా పరిస్థితులు ఉత్పన్నం కావడం.. ఈ మేరకు రోజుకో వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడం చర్చకు దారితీస్తోంది.
ఈ అరోపణలు నిజం కాదని క్షేత్రస్థాయిలో తాము, తమ ఎమ్మెల్యేలు పనిచేస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచాన వేస్తున్నామని ప్రభుత్వం వాదనలు నిజమవుతున్నాయి. గ్రౌండ్ స్థాయిలో తమ నియోజకవర్గ ప్రజల బాగోగులు చూసుకుంటున్న ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతున్నారు. వారే కాదు వారితో పాటు ప్రజాప్రతినిదులు కుటుంబాలు కూడా కరోనా ప్రభావానికి గురై హోం ఐసోలేషన్ స్వియ నిర్భందంలో ఉండాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు సమస్యల పరిష్కారంలో తలమునకలైన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
ఈ విషయాన్ని మేడ్చల్ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ ఆనంద్ ధ్రువీకరించారు. కరోనా జాగ్రత్తలు తీసుకున్నా తనకు ఎలా వ్యాపించిందా.. అన్న ప్రశ్నలు ఎమ్మెల్యే వివేకానేందలో తలెత్తాయి. అయితే ఆయనతో పాటు ఆయన ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది, ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్ సోకినట్లు ఆదివారం డాక్టర్లు వెల్లడించారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు తమ ఇంట్లోనే వేర్వేరు గదుల్లో హోం క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కుటుంబం డాక్టర్ల సూచన మేరకు 14 రోజులు హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందనున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ లు, శానిటైజర్లతో శుభ్రంగా ఉండాలని సూచించారు. ప్రజలంతా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇక ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కరోనా పాజిటివ్ బారిన పడి చికిత్స పోంది బయటపడ్డారు. ఏకంగా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలి, ఉప సభాపతి పద్మారావు, జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, నిజమాబాద్ అర్భన్ ఎమ్మెల్యే బిగ్గాల గణేశ్ గుప్తా సహా పలువురు కరోనా బారిన పడి చికిత్స పోందారు. ఇక ఇటు కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, గుడూరు నారాయాణ రెడ్డి. బిజేపి నేత చింతల రామచంద్రారెడ్డిలు కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. మరోవైపు తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నిత్యం వంద దాటుతున్నాయి. ఆదివారం మొత్తం 1296 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 45,076కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,224గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1831 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more