మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఇవాళ ప్రారంభించింది. రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలతో సీబీఐ అధికారులు నాలుగో రోజు విచారణ కొనసాగిస్తున్నారు. ఉదయం కడప నుంచి పులివెందుల చేరుకున్న ఏడుగురు సభ్యుల సీబీఐ బృందం విచారణ చేపట్టింది. పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సీబీఐ అధికారులు .. వివేకా హత్యకేసు వివరాలు తెలుసుకున్నారు. 2019 మార్చి 15న పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలు, సిట్ అధికారుల దర్యాప్తు నివేదికను పరిశీలించారు.
ఇప్పటికే సిట్ అధికారులు పలువురు రాజకీయ ప్రముఖులు, వైసీపీ, టీడీపీ నాయకులు, అనుమానితులను కలిపి మొత్తం 1300 మందిని విచారించారు. ఆ విచారణ నివేదికను సీబీఐ అధికారులు క్షుణ్నంగా పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు రెండో రోజు కూడా ఇంటిని పరిశీలిస్తున్నారు. వివేకా హత్యకు గురైన పడక, స్నానపు గదులను పరిశీలించారు. వివేకా భార్య సౌభాగ్యమ్మతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పులివెందుల మున్సిపాలిటీ సర్వేయర్ ద్వారా ఇంటి కొలతలు వేయించారు. ఇంటికి ఎన్ని గదులు, కిటికీలు ఉన్నాయని క్షుణ్నంగా పరిశీలించారు.
ఆ తరువాత సీబిఐ అధికారుల బృందం నేరుగా పులివెందులలోని వైఎస్ వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన భార్య సౌభాగ్యమ్మను కలసిన అధికారుల బృందం అమెను అడిగి పలు విషయాల్లో స్పష్టతను తెచ్చుకున్నట్లు సమాచారం. ఆదే సమయంలో ఇంట్లోనే వున్న వైఎస్ వివేక తనయ సునితను కూడా సీబిఐ అధికారులు పలు విషయాలపై ప్రశ్నించారు. సీబిఐ అధికారుల బృందం సుమారు నాలుగు గంటల పాటు వైఎస్ వివేకా నివాసంలో సౌభాగ్యమ్మతో పాటు సునితను పలు విషయాలపై విచారించారు, అలాగే ఆ నివాసంలోనూ అధికారులు క్షణ్ణంగా మరిన్ని ఆధారాల కోసం పరిశీలించారు.
హత్యకు రాజకీయ కారణాలా?, భూమి, ఆస్తి తగాదాలా అనే విషయాలను సిట్ తేల్చలేకపోయిందని చెబుతూ.. హత్య ఘటన ఆంధ్రప్రదేశ్ కే పరిమితం కాదని, ఇతర రాష్ట్రాల వ్యక్తుల జోక్యం ఉండొచ్చనే సందేహాలతో హైకోర్టు కేసును సీబిఐకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఏకంగా 16 మాసాల అనంతరం న్యాయస్థానం అదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ తమ పనిని వేగవంతం చేశారు. శనివారం రోజున కడప జిల్లా ఎస్సీ కార్యలయంలో ప్రారంభమైన విఛారణ.. ఇవాళ వివేక కుటుంబసభ్యుల విచారణతో ఓ అధ్యాయన్ని ముగించింది. ఇక ఈ కేసులు నిందితులను, అనుమానితులను అందరినీ విచారించిన తరువాత సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు ముగించి, ‘తుది నివేదిక’ను న్యాయస్థానానికి అందించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more